Revenue from Registration Department : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఏప్రిల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రానికి రూ.1,003 కోట్ల రాబడి తెచ్చింది. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,04,407 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రతి నెల సగటున రూ.1,300 కోట్ల చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,600 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది.
మొదటి నెలలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారానే రూ.1,003 కోట్ల ఆదాయం రాగా.. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రాబడిని కలిపితే ఇది మరింత పెరగనుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,436 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా అంచనాల మేరకు రాబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: