ETV Bharat / city

తెలంగాణలో తొలి కొవిడ్ టీకా.. పారిశుద్ధ్య కార్మికుడికే!

author img

By

Published : Jan 14, 2021, 6:56 AM IST

రాష్ట్రంలో తొలి కొవిడ్‌ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. ఈ నెల 16న ఆయనకు టీకా వేయడంతో రాష్ట్రంలో పంపిణీ ప్రారంభమవుతుంది. తొలిరోజున టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి.

the first covid vaccine will be given to sanitation worker in telangana
తెలంగాణలో తొలి కొవిడ్ టీకా.. పారిశుద్ధ్య కార్మికుడికే!

తెలంగాణలో తొలి కరోనా టీకాను గాంధీ ఆస్పత్రిలో సేవలందిస్తోన్న పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 40 కేంద్రాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో, 99 కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ముందుగా ప్రభుత్వ వైద్యంలో టీకాలు వేస్తే, సమస్యలపై పూర్తి అవగాహన వస్తుందని భావిస్తోంది. తొలివారం మొత్తం సర్కారు దవాఖానాల్లోనే నిర్వహించి, రెండో వారం నుంచి ప్రైవేటులోనూ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష జరిగింది. గురువారం సాయంత్రానికి కొవిన్‌ యాప్‌ సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. టీకా పంపిణీ ప్రారంభమయ్యాక కూడా యాప్‌లో సమస్యలు ఎదురైతే.. ఆఫ్‌లైన్‌లో సమాచారాన్ని పొందుపర్చాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే.. 104 నంబరుకు కాల్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు.

జిల్లాలకు తరలిన టీకాలు

రాష్ట్రంలో 33 జిల్లాల్లోని 139 కేంద్రాలకు టీకాల తరలింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికి 3.64 లక్షల కొవిషీల్డ్‌, 20 వేల కొవాగ్జిన్‌, మొత్తంగా 3.84 లక్షల టీకాలు రాష్ట్ర స్థాయి గిడ్డంగికి చేరాయి. ఆయా జిల్లాలకు 5,527 కొవిషీల్డ్‌ టీకా వాయిల్స్‌ను పంపించారు. తొలివారంలో 55,270 మంది సర్కారు వైద్యసిబ్బందికి టీకా ఇస్తారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 18,070 మంది ఉండగా.. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 230 మంది నమోదయ్యారు. ప్రభుత్వ రంగంలోని 1.60 లక్షల మంది వైద్యులు, సిబ్బందికి దశల వారీగా టీకాలిస్తారు. కేంద్రం నుంచి మరికొన్ని డోసులు రాగానే ప్రైవేటు వైద్య సిబ్బందికీ వేస్తారు. టీకా పంపిణీలో స్థానిక నాయకులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా అధికారులను ఆరోగ్యశాఖ ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాలను దేశంలోని పలు నగరాలకు బుధవారం తరలించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో వీటిని రవాణా చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 20 వేల టీకాలను పంపించారు.

నిల్వ కేంద్రాల్లో భద్రత

జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని 866 కేంద్రాల్లోనూ టీకాలను నిల్వ చేస్తున్నారు. బుధవారం అన్ని జిల్లాలకు తరలింపు సందర్భంగా ప్రతి వాహనం వెంట సాయుధ పోలీసు సిబ్బంది వెళ్లారు. అన్ని కేంద్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కోఠిలోని ప్రధాన కార్యాలయంలో ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని ఉంచారు. అన్ని కోల్డ్‌చైన్‌ కేంద్రాల్లోనూ సీసీ టీవీలు ఏర్పాటు చేశారు. టీకాల భద్రత వ్యవహారాలను శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సూచనల కోసం కాల్‌ సెంటర్‌

టీకా తీసుకున్నాక దుష్ఫలితాలు (సైడ్‌ఎఫెక్ట్స్‌) ఎదురైతే.. వైద్య సూచనలు పొందడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అయిదుగురు వైద్యనిపుణులుంటారు. వీరికి ఒక్కొక్కరికి 5-6 జిల్లాల చొప్పున కేటాయిస్తారు. ఆయా జిల్లాల్లో టీకా పంపిణీ కేంద్రాల్లోని వైద్యాధికారి వద్ద ఈ నిపుణుల ఫోన్‌ నంబర్లుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు ఈ నిపుణులను సంప్రదించి బాధితులకు చికిత్స చేస్తారు.

50 లక్షల అతి సురక్షిత సిరంజిలు

కొవిడ్‌ టీకాల పంపిణీలో అధునాతన సిరంజిలనే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించి, సుమారు 50 లక్షల ఆటో డిజబుల్‌ (ఏడీ) సిరంజిల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. ఒకరికి టీకా ఇచ్చిన తర్వాత.. ఆ సిరంజీని రెండోసారి వాడడానికి వీలుండదు. ఈ తరహా సిరంజీలు పూర్తి సురక్షితమని వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15 లక్షల ఏడీ సిరంజీలను జిల్లాలకు సరఫరా చేశారు.

టీకా పొందితే ధ్రువపత్రం

టీకా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడే అక్కడున్న వైద్యులు లబ్ధిదారుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. జ్వరం ఉన్నట్లు తేలితే లోనికి అనుమతించరు. కొవిడ్‌ లక్షణాలున్నా, కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నా టీకా ఇవ్వరు. కొవిన్‌ యాప్‌లో సమాచారం నమోదు సహా మొత్తం ప్రక్రియల్లో ఏమరుపాటుగా వ్యవహరించవద్దని ఆరోగ్యశాఖ తమ అధికారులకు సూచించింది. తొలిడోసు పొందిన లబ్ధిదారుడు రెండో డోసు ఎప్పుడు పొందాలో అతడి మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. రెండోడోసు పూర్తయ్యాక కొవిడ్‌ టీకా పొందినట్లుగా మొబైల్‌ ఫోన్‌కు ధ్రువపత్రం అందుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.

4 కోట్లకు పెరిగిన నిల్వ సామర్థ్యం

రాష్ట్రంలో టీకాల నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రస్థాయి నిల్వ కేంద్రంలో ఇప్పటికే 88 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యమున్న 3 అతి శీతల పరికరాలున్నాయి. హైదరాబాద్‌ సహా అన్ని పూర్వ జిల్లా కేంద్రాల్లోనూ ఒక్కోటి 53 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో.. మొత్తం 10 వాకిన్‌ కూలర్స్‌ ఉన్నాయి. కొత్తగా ఒక్కోటి 40 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 4 వాకిన్‌ కూలర్లు, 20 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 6 వాకిన్‌ ఫ్రీజర్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే 40 క్యూ.మీ. వాకిన్‌ కూలర్‌ రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రానికి చేరుకుంది. వారం రోజుల్లో మిగిలినవి కూడా రానున్నాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో 1.5 కోట్లు, ప్రాంతీయ నిల్వ కేంద్రాల్లో 1.5 కోట్లు, 866 పీహెచ్‌సీల్లోని అతి శీతల పరికరాల్లో మరో కోటి... మొత్తం 4 కోట్ల మేర కొవిడ్‌ టీకాలను నిల్వ చేయవచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. అతి శీతల పరికరాల్లో 2-8 డిగ్రీల నిర్ణీత ఉష్ణోగ్రతలను నిరంతరం కొనసాగించపోతే.. టీకా సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ ప్రమాణాలను కొవిన్‌ యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.