YS Viveka murder case: వివేకా హత్యకేసులో సీబీఐ మరోసారి విచారణ ప్రారంభించింది. నెల రోజుల విరామం తర్వాత ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాజీ టీవీ-9 రిపోర్టర్ సదాశివరెడ్డిని విచారించారు. హత్య జరిగిన తర్వాత కొన్ని నెలలకు సునీల్ గ్యాంగ్ ఆగడాలపై ఆ ఛానల్లో కథనం ప్రసారం అయ్యింది.
YS Viveka murder case: వివేకాను సునీల్ గ్యాంగ్ హత్య చేసిందా అనే కోణంలో ఆ కథనం ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులు సదాశివారెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు అతన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Boyaguda Fire Accident CC Footage: బోయిగూడ అగ్నిప్రమాదం సీసీటీవీ దృశ్యాలు