ETV Bharat / city

ట్రాఫిక్​ పోలీసులకు షాకిచ్చిన మందుబాబులు ​​​​​​​ - ట్రాఫిక్​ పోలీసులకు షాక్

హైదరాబాద్​ కొండాపూర్​లో ఇద్దరు వ్యక్తులు బైక్​ మీద వెళ్తున్నారు. వారిని పోలీసులు ఆపారు. శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర బ్రీత్‌ ఎనలైజర్‌ పెట్టారు. బ్రీత్‌ ఎనలైజర్‌ యంత్రాన్ని పోలీసుల చేతుల్లోంచి లాక్కొని ఉడాయించారు మందుబాబులు.

breath analyzer machine stolen
breath analyzer machine stolen
author img

By

Published : Sep 19, 2021, 3:13 PM IST

రాత్రిపూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించే ట్రాఫిక్‌ పోలీసులకు కొందరు మందుబాబులు చుక్కలు చూపిస్తుంటారు. తాగిన మైకంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ చిందులు తొక్కుతూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఇదంతా రోజూ పోలీసులకు ఎదురయ్యే అనుభవాలే. తాజాగా కొండాపూర్‌లో శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర పెట్టిన బ్రీత్‌ ఎనలైజర్‌ యంత్రాన్ని పోలీసుల చేతుల్లోంచి లాక్కొని ఉడాయించారు ఇద్దరు మందుబాబులు.

కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌ సమీపాన శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాత్రి 11.45 సమయంలో మియాపూర్‌ వైపు నుంచి ద్విచక్ర వాహనం మీద వస్తోన్న ఇద్దరిని వారు ఆపారు. బైకు నడుపుతున్న వ్యక్తికి శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు హోంగార్డు తన చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను యువకుడి నోటికి దగ్గరలో పెట్టాడు. ఇంతలో సదరు యువకుడు హోంగార్డు చేతిలో ఉన్న యంత్రాన్ని లాక్కొని వేగంగా బైకు మీద దూసుకెళ్లి మాయమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు అందుకున్న మాదాపూర్‌ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి: LIVE VIDEO: నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో పడిపోయిన మున్సిపల్​ ఛైర్​పర్సన్..!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.