ETV Bharat / city

వైద్య సేవల్లో తెలుగు రాష్ట్రాల పురోగమనం - జాతీయ ఆరోగ్య మిషన్

వైద్యసేవల పనితీరులో తెలుగు రాష్ట్రాలు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ బలోపేతం - రాష్ట్రాల వారీగా 2018-19 పేరిట కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఏడు ప్రధాన అంశాల ప్రాతిపదికన పనితీరును అంచనా వేయగా... ఆంధ్రప్రదేశ్​కు 7, తెలంగాణకు 5 ప్రోత్సాహక మార్కులు లభించాయి.

వైద్య సేవల్లో తెలుగు రాష్ట్రాల పురోగమనం
author img

By

Published : Oct 17, 2019, 10:04 AM IST

Updated : Oct 17, 2019, 10:20 AM IST

దేశవ్యాప్తంగా వైద్యసేవల పనితీరులో తెలుగు రాష్ట్రాలు పురోగమిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ బలోపేతం - రాష్ట్రాల వారీగా 2018-19 పేరిట... జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం సంయుక్తంగా రూపొందించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది. ఏడు ప్రధాన అంశాల ప్రాతిపదికన పనితీరును అంచనా వేయగా ఆంధ్రప్రదేశ్​కు 7, తెలంగాణకు 5 ప్రోత్సాహక మార్కులు లభించాయి.

తెలంగాణ 13... ఏపీకి 7వ స్థానం..!

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని మార్కులను కేటాయించారు. మార్కుల ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులను కేటాయించగా మొదటి మూడు స్థానాల్లో దాద్రానగర్​ హవేలి. హరియాణా ,అసోం నిలిచాయి. ఏపీ 7వ స్థానం, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.

మార్కుల ప్రాతిపదికన నిధుల కేటాయింపు
సాధించిన మార్కుల ప్రాతిపదికన రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయింపు ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. 2018-19లో వైద్యసేవల పనితీరులో ప్రోత్సాహక నిధులు సాధించినందుకుగాను తెలంగాణకు రూ.81.76కోట్లు, ఏపీకి రూ.122.68కోట్లు... 2019-20 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి: ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

Intro:Body:Conclusion:
Last Updated : Oct 17, 2019, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.