Maha bird flu: మహారాష్ట్రలోని షహాపూర్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో థానే జిల్లా కలెక్టర్ స్పందించారు. థానే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజేశ్ నర్వేకర్ స్పష్టం చేశారు.
ఇటీవల వెహ్లోలి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 100 కోళ్లు చనిపోయాయి. వాటినుంచి సేకరించిన నమూనాలను పుణేలోని ల్యోబోరేటరీకి పరీక్షలకు పంపగా అసలు విషయం బయటపడింది. అవి బర్డ్ ఫ్లూ(H5N1) వైరస్ కారణంగానే చనిపోయాయని నిర్ధరించినట్లు థానే జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ భౌసాహెబ్ దంగ్డే తెలిపారు.
culling of birds in the farms: బర్డ్ ఫ్లూ కేసులు బయటపడిన పౌల్ట్రీ ఫామ్‌కు కిలోమీటరు పరిధిలోని ఫామ్‌లలోని కోళ్లను చంపేందుకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసిందని నర్వేకర్ వెల్లడించారు.
శుక్రవారం ఉదయం వరకు షహాపూర్‌లో 15,600 బ్రాయిలర్ కోళ్లు, 7,962 లేయర్ కోళ్లు, 20 బాతులను చంపినట్లు థానే జిల్లా పరిషత్ PRO పంకజ్ చవాన్ తెలిపారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్- ముగ్గురు మృతి