ETV Bharat / city

టెట్‌ పరిమితి జీవితకాలం.. ఇప్పటి నుంచి వర్తింపు - TET score duration will be now extended to lifetime

టెట్​ స్కోర్ కాలపరిమితి ఇక జీవితకాలం ఉండనుంది. ప్రస్తుతం ఏడేళ్ల వరకు ఉన్న మార్కుల విలువను జీవితకాలానికి పొడిగిస్తూ.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

TET score duration will be now extended to lifetime
టెట్‌ పరిమితి జీవితకాలం
author img

By

Published : Oct 22, 2020, 7:57 AM IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) స్కోర్‌ కాలపరిమితి ఇక జీవితకాలం ఉండనుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రస్తుతం దాని మార్కుల విలువ ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తాజాగా టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా నిర్ణయించింది. ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలగనుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించారు.

అధిక స్కోర్‌ కోసమే..

బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన వారు టెట్‌ రాయడానికి అర్హులు. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకానికి నిర్వహించే డీఎస్‌సీ/టీఆర్‌టీ రాయడానికి టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇందులో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఒకసారి ఉత్తీర్ణులైనా.. ఎక్కువ మార్కుల కోసం మళ్లీ మళ్లీ రాస్తుంటారు. ఒక్కసారి ఉత్తీర్ణులైతే టెట్‌ స్కోర్‌కు జీవితకాలం విలువ ఇస్తామని తాజాగా నిర్ణయం తీసుకున్నా.. పోటీని తట్టుకొని ప్రభుత్వ కొలువు దక్కించుకోవడానికి అధిక స్కోర్‌ కోసం అభ్యర్థులు ఈ పరీక్షను ఎప్పటికప్పుడు రాస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అధిక స్కోర్‌ సాధించిన వారు తాజా నిర్ణయం కారణంగా గడువు తీరిపోతుందని పరీక్ష రాయాల్సిన పని ఉండదు.

ముగిసిన మూడు టెట్ల గడువు

మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో 2011, జులైలో టెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షను ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించగా.. తెలంగాణ ఆవిర్భావం తరవాత రాష్ట్రంలో రెండు సార్లు నిర్వహించారు. ఏడేళ్లు కాలపరిమితి కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన మూడు టెట్ల స్కోర్‌కు గడువు తీరిపోయింది. ఉమ్మడి ఏపీలో చివరిసారి 2014, మార్చిలో టెట్‌ జరపగా దాని కాలపరిమితి కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి ముగియనుంది. తెలంగాణలో 2016, మేలో మొదటిసారి, 2017, జులైలో చివరిసారి పరీక్ష జరిపారు. అప్పటి నుంచి మళ్లీ నిర్వహించలేదు. ‘ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి కూడా తాజా ఎన్‌సీటీఈ నిర్ణయాన్ని వర్తింపజేస్తే రాష్ట్రంలో వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.