రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పేపర్-1కి 3,51, 468 మంది, పేపర్-2కి 2,77,884 మంది పరీక్ష రాయనున్నారు. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఈనెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్-1 పరీక్షకు 1,480 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు.
అనుమతి నిరాకరణ: సంగారెడ్డి జిల్లాలో టెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చారని అభ్యర్థికి అనుమతి నిరాకరించారు. పటాన్‌చెరు సెయింట్ జోసఫ్ హైస్కూల్లో టెట్ పరీక్ష రాసేందుకు దీప్తి అనే అమ్మాయి ఆలస్యంగా వచ్చింది. దీంతో 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చారంటూ అధికారులు అనుమతించలేదు.
ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత కోసం పేపర్-1, ఆరు నుంచి ఎనిమిది వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అర్హత కోసం పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష సమయం ముగిసే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే ఓఎంఆర్ పత్రాల్లో సమాధానాలను దిద్దాలని అధికారులు తెలిపారు. మొబైల్స్, బ్యాగులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని కన్వీనర్ రాధారెడ్డి అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: