Tension At Amaravati Farmers MahaPadayatra: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెనాలిలో ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు వారిని అడ్డుకుని.. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర చేస్తామని చెప్పిన రైతులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టివేశారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట జరిగింది.
3rd day Padayatra: అంతకుముందు మూడో రోజైన నేడు రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు పాదయాత్రలో పాల్గొన్న పలువురు రైతులు తెలిపారు. ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు.
ఇవీ చదవండి:
బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన తెరాస అనుబంధ దళిత సంఘాలు
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు ముర్ము.. రాష్ట్రపతిగా తొలి విదేశీ పర్యటన