శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి అధికారులు వరద నిటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,01,818 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,96,497 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 883.80 అడుగులు కాగా... నీటి నిల్వ 208.72 టీఎంసీలకు చేరింది.
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26 వేల 677 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాలకు వరద తాకిడి కొనసాగుతోంది. మరికొన్నిరోజులపాటు శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం