ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలుగు లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today, telangana  news
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Jan 8, 2022, 11:01 AM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మెట్​పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వంటగదిలో సకినాలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఒక్కసారిగా సిలిండర్​ నుంచి మంటలు చెలరేగాయి.

  • గడ్డెన్న వాగులో మృతదేహాలు

నిర్మల్ జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాల కలకలం సృష్టించాయి. ఉదయపు నడకకు వెళ్లిన వాకర్స్​కు గడ్డెన్న వాగులో మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

  • గ్రేటర్​లో మరోసారి ఫివర్​ సర్వే

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటికే నగరంలో 99 వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని... 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ కొనసాగుతోందని చెప్పారు.

  • దేశంలో కరోనా విలయం..

దేశంలో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.41లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి చేరింది.

  • రూ.1000కి ఫేక్​ వ్యాక్సిన్ సర్టిఫికేట్​

రూ.1000 తీసుకుని కొవిడ్​ వ్యాక్సిన్ ఫేక్​ సర్టిపికెట్లు సృష్టిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీకా తీసుకోవడానికి సుముఖంగా లేని వారు ఇతన్ని సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పంజా

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 27లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అమెరికాలోనే 8.5లక్షలు కేసులు రాగా.. ఫ్రాన్స్​లో 3.28 లక్షలు వచ్చాయి. బ్రిటన్​, స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీ, భారత్​ వంటి దేశాల్లో లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

  • లెజెండ్స్ క్రికెట్ లీగ్​లో మహ్మద్ కైఫ్, బిన్నీ

రిటైరైన క్రికెటర్లతో జరగబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్​ టోర్నీలో ఇండియా మహారాజా జట్టులోకి మరో ఇద్దరు వచ్చి చేరారు. మహ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీ కూడా ఈ టోర్నీలో ఆడబోతున్నారు. ఇప్పటికే భారత్​ తమ జట్టును ప్రకటించింది.

  • 'కట్టప్ప' సత్యరాజ్​కు కరోనా

సీనియర్​ నటుడు సత్యరాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

  • తెలంగాణకు చెందిన కుటుంబం ఆత్మహత్య

విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

  • రాఘవ దందా రాజ్యం..

నాలుగు దశాబ్దాల రాజకీయం. గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నేత. 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం. తమ ప్రతినిధిగా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర.... వెరసి పుత్రరత్నం తెచ్చిన తలవంపులు మాయనిమచ్చను మిగిల్చాయి.

  • ఎమ్మెల్యే సతీమణికి గాయాలు

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మెట్​పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వంటగదిలో సకినాలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఒక్కసారిగా సిలిండర్​ నుంచి మంటలు చెలరేగాయి.

  • గడ్డెన్న వాగులో మృతదేహాలు

నిర్మల్ జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాల కలకలం సృష్టించాయి. ఉదయపు నడకకు వెళ్లిన వాకర్స్​కు గడ్డెన్న వాగులో మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

  • గ్రేటర్​లో మరోసారి ఫివర్​ సర్వే

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటికే నగరంలో 99 వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని... 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ కొనసాగుతోందని చెప్పారు.

  • దేశంలో కరోనా విలయం..

దేశంలో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.41లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి చేరింది.

  • రూ.1000కి ఫేక్​ వ్యాక్సిన్ సర్టిఫికేట్​

రూ.1000 తీసుకుని కొవిడ్​ వ్యాక్సిన్ ఫేక్​ సర్టిపికెట్లు సృష్టిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీకా తీసుకోవడానికి సుముఖంగా లేని వారు ఇతన్ని సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పంజా

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 27లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అమెరికాలోనే 8.5లక్షలు కేసులు రాగా.. ఫ్రాన్స్​లో 3.28 లక్షలు వచ్చాయి. బ్రిటన్​, స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీ, భారత్​ వంటి దేశాల్లో లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

  • లెజెండ్స్ క్రికెట్ లీగ్​లో మహ్మద్ కైఫ్, బిన్నీ

రిటైరైన క్రికెటర్లతో జరగబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్​ టోర్నీలో ఇండియా మహారాజా జట్టులోకి మరో ఇద్దరు వచ్చి చేరారు. మహ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీ కూడా ఈ టోర్నీలో ఆడబోతున్నారు. ఇప్పటికే భారత్​ తమ జట్టును ప్రకటించింది.

  • 'కట్టప్ప' సత్యరాజ్​కు కరోనా

సీనియర్​ నటుడు సత్యరాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.