ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @9AM - టాప్​టెన్ న్యూస్

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today, telangana news
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Jan 8, 2022, 9:00 AM IST

  • నేతన్నలకు​ ప్రభుత్వం బంపర్​ ఆఫర్

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణలో నెలకొన్న దుర్భర పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కోసం వేల నేత కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాయి. వీరంతా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన చేనేత, జౌళి పార్కుల్లో పరిశ్రమల స్థాపించేందుకు తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్నారు.

  • 'మందులకు కొరత రానీయొద్దు'

రాష్ట్రంలో కరోనా మూడో ముప్పు మొదలవ్వడంతో సర్కార్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది. చికిత్స అవసరమైన ఔషధాల కొరత లేకుండా తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

  • 'పది' పరీక్షల ఫీజు తేదీలు ఖరారు..

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పరీక్షల విభాగం ప్రకటించింది. ఈనెల 29 వరకు విద్యార్థులు పాఠశాలలో ఫీజు చెల్లించాలని డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆలస్య రుసుములతో మార్చి 3 వరకు చెల్లించే అవకాశం కల్పించారు.

  • ఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు నూతన కన్వీనర్‌

వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఈసెట్‌ తప్ప మిగిలిన అన్నింటికీ పాతవారే కన్వీనర్లుగా నియమితులయ్యారు. మిగిలిన ప్రవేశ పరీక్షల కన్వీనర్లు అందరూ పాతవారే. పీఈసెట్‌ కన్వీనర్‌, వర్సిటీలను తర్వాత ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.

  • క్రేజీ ఇన్నోవేషన్..

హైదరాబాద్​లోని ట్రిపుల్ ఐటీ మరో ప్రయోగానికి నాంది పలికింది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ సాయంతో గొంతు క్యాన్సర్​ను ప్రాథమికంగా నిర్ధారించే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం వర్సిటీ, గ్రేస్‌ క్యాన్సర్‌, బెంగళూరుకు చెందిన బయోకాన్‌ ఫౌండేషన్‌ జతకట్టాయి.

  • ''ప్రికాషన్​ డోసు​'కు కొత్తగా రిజిస్ట్రేషన్​ అవసరం లేదు'

ప్రికాషన్​ డోసు తీసుకోవాలంటే మళ్లీ కొత్త రిజిస్ట్రేషన్​ అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్​మెంట్​ తీసుకోవటం, వ్యాక్సినేషన్​ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.

  • పొగబారుతున్న నగరాల ఆరోగ్యం

భూతాపాన్ని కట్టడి చేయాలనే 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందం దరిమిలా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి నియంత్రణకు దేశాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. ఆచరణలో అవి కొల్లబోతున్నాయని 'సి40' నివేదిక నిగ్గుతేల్చింది. ఉద్గారాలను కట్టడి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలను వెంటనే అమర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 79 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఆదేశించింది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు దశలవారీగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతోంది.

  • 40 ఏళ్లుగా ప్రేమ.. ఇప్పుడు పెళ్లి..

ఒక దేశం అమ్మాయి.. మరో దేశం అబ్బాయి పెళ్లి చేసుకోవడం.. వయసులో తనకంటే చిన్నవాడిని వివాహం చేసుకున్న అమ్మాయిలను చూశాం. అలాంటి కోవకే చెందిన ఓ యువతి.. 40 ఏళ్ల ప్రేమ పెళ్లిపీటలెక్కించింది. అయితే.. వరుడి గురించి తెలుసుకున్నవారంతా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఇంతకీ అతను ఎవరంటే?

  • 'బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలి'

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో బెన్‌ స్టోక్స్‌ అనూహ్య రీతిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ స్పందించాడు. 'బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలి' అని ట్వీట్​ చేశాడు. దీనిపై పలువురి మాజీల స్పందన ఎలా ఉందంటే..?

  • సినీ వినీలంలో అసాధ్యుడు..

బ్లాక్‌బస్టర్ సినిమాలతో దమ్ముచూపి.. బాక్సాఫీసులో దుమ్మురేపిన సీనియర్​ కథానాయకడు.. సూపర్​స్టార్​ కృష్ణ. దశాబ్దాల క్రితమే 'సూపర్ స్టార్ డమ్' సాధించిన అగ్రహీరో ఆయన. అయితే ఇప్పటికే ఎందరో దిగ్గజ నటుల గురించి విశేషాల్ని పంచుకున్న 'వెండితెర తెర వేల్లులు' షో.. ఈ వారం జవవరి 9న కృష్ణ సాహసాల్ని గుర్తుచేయబోతుంది. ఈ కార్యక్రమాన్ని మీరూ చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.