ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @7AM - తెలుగు లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today, telangana  news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Jan 8, 2022, 7:16 AM IST

  • తాగునీటి సరఫరాకు.. వడవడిగా పనులు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మినహాయిస్తే.. ఏ నగరంలోనూ ప్రతి రోజు తాగునీరు సరఫరా చేయడం లేదు. గత ఏడాదిన్నర కాలంగా కరీంనగర్‌లో విజయవంతంగా రోజూ నీటి సరఫరా కొనసాగుతోంది. ప్రతిరోజు నీటి సరఫరాలో ఉన్న లోపాలను సవరించుకొంటూ ప్రయోగాత్మకంగా నిరంతర నీటి సరఫరాకు సన్నాహాలు చేస్తోంది. దీనికిగాను 3 జోన్లలో ఈ పథకాన్ని అమలు చేసి.. అందులో లోపాలను అధిగమించి మొత్తం నగరానికి సరఫరా చేయాలన్నప్రణాళిక అమలు చేస్తోంది.

  • రైతుబంధు పైసలు తీసుకోకుండా చేస్తున్న బ్యాంకులు..

రైతుబంధు సాయాన్ని ఇతర రుణాలకు లంకె పెట్టి ఇవ్వకుండా ఆపొద్దని ప్రభుత్వం సూచించినా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా రైతుబంధు డబ్బుల కోసం అన్నదాతలు బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సివస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం గువ్వలదిన్నె రైతులకు అదే పరిస్థితి ఎదురైంది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని చాల బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

  • మరో మూడు వేల కోట్ల రుణం

రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్​బ్యాంకు వేయనున్న బాండ్ల వేలంలో మరో మూడు వేల కోట్లను రుణంగా సమీకరించనుంది.

  • వారంలో 10 సైబర్​ మోసాలు..

సైబర్‌ మోసాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... కొత్త కొత్త ఎత్తులతో నేరగాళ్లు అమాయకులను నిండా ముంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగటంతో.. వాడకంపై అవగాహన సరిగా లేని వాళ్లను ఆసరాగా చేసుకుంటూ కొత్త మార్గాల్లో గాలం వేస్తున్నారు. ఇప్పటి వరకు 'ఈ-మెయిల్‌', మెసేజ్‌ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగ్న వీడియోలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనే ప్రకటనలతో నిండా ముంచుతున్నారు.

  • మోదీకి మెదక్​ విద్యార్థుల 200 ఉత్తరాలు..

మెదక్​ జిల్లా విద్యార్థులు ఏకంగా ప్రధాని మోదీకే ఉత్తరాలు రాశారు. తాము చదవుకునేందుకు జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. లేఖలు పంపించారు. వారి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాల పెట్టాలని మోదీని కోరారు.

  • మోదీ పర్యటనలో భద్రతా లోపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తిన ఘటనలో 150 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు ఫిరోజ్​పుర్ జిల్లా పోలీసులు. గురువారం కుల్​గరీ పోలీసు స్టేషన్​లో ఈమేరకు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి.

  • గేమ్​ ఆడుతున్నాడని చితకబాదిన తండ్రి..

చదువుకోకుండా ఫోన్​లో గేమ్​ ఆడుతున్నాడని ఐదేళ్ల కుమారున్ని కొట్టి చంపాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన దిల్లీలోని నెబ్​ సరాయ్​ ప్రాంతంలో జరిగింది.

  • ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌..

'ట్రూత్‌ సోషల్‌' అనే యాప్‌ ద్వారా మరోసారి సామాజిక మాధ్యమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. ఫిబ్రవరి 21న ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

  • రహానె వద్దు.. విహారి ముద్దు

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉంటే రహానెను తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌. అతడి స్థానంలో విహారిని ఆడించాలని పేర్కొన్నాడు.

  • 'నాగ్​తో పనిచేస్తే ఫుల్​ జోష్'

నాగార్జునతో పనిచేయడం ఎప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుంది అని అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. ఆయన స్వరాలు సమకూర్చిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన కెరీర్​ సహా చిత్ర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.