ETV Bharat / city

Top News Today : టాప్​న్యూస్​@ 7AM - తెలుగు వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News Today, telangana news
తెలంగాణ టాప్​న్యూస్​
author img

By

Published : Jan 3, 2022, 6:59 AM IST

  • కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్​ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్​బీలోని శివపార్వతి థియేటర్​లో మంటలు చెలరేగి... సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి... మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • అస్త్రశస్త్రాలతో పీఏసీ సమావేశానికి సిద్ధం

రాష్ట్ర పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్‌ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు... పార్టీ కార్యక్రమాల నిర్ణయంపై పట్టుబట్టే అవకాశం ఉంది.

  • ' జీవోను వెంటనే రద్దు చేయాలి'

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలి గందరగోళానికి దారితీసిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘం నాయకులు ఆయనను కలిశారు. ఈసందర్భంగా 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  • 'ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం'

17 ఏళ్లలో ప్రపంచంలో 20 శాతం వ్యవసాయ భూములు తగ్గాయని ఐక్యరాజ్యసమితి ఆహార-వ్యవసాయ సంస్థ నివేదికలో వెల్లడించింది. కోతలు, కాలుష్యంతో నేలలు నిస్సారమవుతున్నాయని... ఉత్పాదకత తగ్గుతుందని స్పష్టం చేసింది. లోపించిన యాజమాన్య పద్ధతులు, సాంకేతిక వినియోగంలో వెనుకబాటే దీనికి ప్రధానకారణమని పేర్కొంది. 2050 నాటికి ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం మారే అవకాశముందని తెలిపింది.

  • కన్నోళ్లకు కన్నీటిని మిగిల్చి...

నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకుందామని... హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లిన యువకుల విహారయాత్ర విషాదాంతమైంది. ఆర్కేబీచ్‌కు వెళ్లిన 8మందిలో స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులతోపాటు కాలనీవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గల్లంతైనవారు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

  • పిల్లలకు నేటి నుంచి టీకా

దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇవ్వనున్నారు.

  • గాంధీజీ ఆ'పరేషాన్‌'!

గాంధీజీని అనేకసార్లు అరెస్టు చేసినా... ఆయన విషయంలో అత్యంత జాగ్రత్త పడేది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఓసారి అనూహ్యంగా గాంధీకి తలెత్తిన అత్యవసర ఆరోగ్య పరిస్థితి ఆయన కంటే... ఆంగ్లేయులను ఆందోళనలోకి నెట్టింది.

  • 'గళమెత్తాల్సిన సమయమిదే!'

మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఓ వర్గానికి చెందిన మహిళలే లక్ష్యంగా 'బుల్లీ బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • సిరీస్​పై కన్నేసిన భారత్

బాక్సింగ్​ డే టెస్టులో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమ్​ఇండియా.. అదే జోరుతో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్​ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సమం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జోహనస్​బర్గ వేదికగా ఈ మ్యాచ్​ సోమవారం ప్రారంభంకానుంది.

  • సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'?

'ఆర్ఆర్ఆర్' వాయిదా పడేసరికి చాలావరకు చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇప్పుడా జాబితాలోకి 'శేఖర్' చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో క్లారిటీ రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.