ETV Bharat / city

new farming ideas : విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచించు.. బంగారం పండించు - new farming techniques in telangana

దేశానికి అన్నం పెట్టే అన్నదాతను అనావృష్టి, అతివృష్టి, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు, సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తుండటంతో అప్పులే మిగులుతున్నాయి. రుణమే పాశమై కొందరు బలవన్మరణాలకూ పాల్పడుతుండటం విషాదకరం. విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచిస్తే(new farming ideas).. సేద్యంలోనూ లాభాల బాట పట్టవచ్చంటున్నారు పలువురు కర్షకులు. డ్రాగన్‌ ఫ్రూట్‌, యాపిల్‌, ఉద్యాన పంటల సాగు, నాటుకోళ్లు, చేపల పెంపకం.. ఇలా విభిన్న మార్గాల్లో పయనిస్తూ ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నిరూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తున్న కొందరు రైతులపై ప్రత్యేక కథనాలు..

విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచించు

author img

By

Published : Oct 3, 2021, 6:40 AM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నాశనమైతే ఆ కర్షకుడి బాధ వర్ణనాతీతం. ఎంతో ప్రేమతో వేసిన పంట నీరు లేక ఎండిపోతే ఆ రైతు పడే ఆవేదన చెప్పలేనిది. ఊరంతా అప్పు చేసి వేసిన పంట చీడపట్టి పాడైతే ఆ అన్నదాత గోస చూడలేం. ఇలా రేయింబవళ్లు కష్టించి పండించిన పంట నష్టాల పాలై పెట్టిన పెట్టుబడి కూడా రాక.. అప్పుల పాలై ఆత్మగౌరవం చంపుకుని బతకలేక.. పుడమితల్లిని వదిలి వేరే పని చేయలేక ఎంతో మంది రైతులు ప్రాణాలొదులుతున్నారు. మరోవైపు కొంత మంది కర్షకులు ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా కొత్తగా ఆలోచిస్తే(new farming ideas) సేద్యంలో లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నారు.

లాభాల డ్రాగన్‌

లాభాల డ్రాగన్‌

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో లాభాల పంట పండించవచ్చని నిరూపిస్తున్నారు ఈ రైతులు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే.. సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చంటున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన వనిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్‌రాజు, విశాఖపట్నం జిల్లాకు చెందిన జస్టిన్‌ ఇదే కోవకు చెందుతారు. శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ శాఖలో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి పొలం బాట పట్టారు. 2005లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. ఆరుట్ల గ్రామంలో 13 ఎకరాల్లో తోట పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

పెట్టుబడి.. రాబడి

కరా విస్తీర్ణంలో తోట వేసేందుకు తొలి ఏడాది రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఏటా ఎరువులు, చీడపీడల నివారణ, కూలీలు, విద్యుత్తు బిల్లులు కలిపి గరిష్ఠంగా రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి ఫలసాయం చేతికందుతుంది. రెండో ఏడాది కనీసం 5 టన్నులు, మూడు నుంచి నాలుగేళ్లలో 6-10 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటున్నారు. తోట వద్దే రిటైలర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి కొంటున్నారు. కిలో రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరాకు కనిష్ఠంగా 6 టన్నులు పండినా.. కిలో రూ.100కే అమ్మినా.. ఎకరాకు ఏటా రూ.6 లక్షలు సంపాదించవచ్చని ఆయన తెలిపారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు అన్ని నేలలూ అనుకూలమే అయినా.. నల్లరేగడి నేలల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. తోటలకు వెళ్లి.. పండు రుచి చూశాకే మొక్కలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. లేత మొక్కలకు బదులు అయిదేళ్ల వయసున్న వాటి కొమ్మలు నాటితే రెండో ఏడాది నుంచే దిగుబడి వస్తుందని చెబుతున్నారు.

విశాఖ ఏజెన్సీలో..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లి, అనంతగిరి మండలాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200వరకు ధర పలుకుతోంది. మొదట్లో తైవాన్‌తో పాటు కేరళ, కోల్‌కతా నుంచి మొక్కలను తెప్పించుకునేవారు. ఒక్కోటి రూ.80 నుంచి రూ.100 వరకు ఉంటుంది. ఎకరానికి 4వేల మొక్కలు నాటవచ్చు. 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కొందరు స్థానికంగానే అంట్లు కడుతున్నారు. మిగతా రైతులకు ఒక్కో మొక్కను రూ.50 నుంచి రూ.80లకు అమ్ముతున్నారు. అనంతపురం, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల రైతులు స్థానికంగా కొంత అమ్ముతూ మిగిలిన పండ్లను బెంగళూరు, దిల్లీ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..

డప జిల్లా రామాపురం మండలం నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు దిల్లీ, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని తన పొలంలోనే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు మొదలుపెట్టారు. ఫోన్లపై ఆర్డర్లు పొందుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు పెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి పంపుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..

విశాఖకు చెందిన యువరైతు జస్టిన్‌ అనంతగిరి మండలంలో మూడెకరాల్లో, విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో మరో రెండెకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. ఇవి కాసిన వెంటనే అమ్ముడవుతున్నాయి. ఇంట్లో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ పండ్లతో కేక్‌, జామ్‌, బిస్కెట్లు, బన్‌, జ్యూస్‌ వంటివి తయారుచేస్తున్నారు. ఈ ఉప ఉత్పత్తులను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాల్సి ఉందని జస్టిన్‌ చెబుతున్నారు.

ఎకరంలోనే నాటుకోళ్లు.. ఉద్యాన పంటలు

ఎకరంలోనే నాటుకోళ్లు.. ఉద్యాన పంటలు

మ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన రైతు దంపతులు చిన్నదివెల జమలయ్య- జ్యోతి ఎకరం పొలంలో ఉద్యాన పంటలు, నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారు. వీరికి మొత్తం ఆరెకరాల భూమి ఉంది. అయిదెకరాల్లో వరి పండిస్తున్నారు. మిగతా ఎకరంలో సుమారు 250 నాటుకోళ్లు పెంచుతున్నారు. కోళ్లు, పిల్లల కోసం రేకులతో నిర్మించిన షెడ్డులో ప్రత్యేకంగా గదులు, బోన్లు ఏర్పాటు చేశారు. ధాన్యం, బియ్యం, నూకలను వాటికి మేతగా వేస్తున్నారు.

కడియం నుంచి మొక్కలు తెచ్చి..

కడియం నుంచి మొక్కలు తెచ్చి..

ఆ ఎకరం పొలంలోనే కోళ్ల షెడ్డు పోను మిగతా స్థలంలో వివిధ రకాల ఉద్యాన పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏపీలోని కడియం నర్సరీ నుంచి ఏడాది క్రితం మొక్కలు తీసుకొచ్చారు. జామ, మామిడి, కొబ్బరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, ద్రాక్ష, పనస, గంగరేగిపండ్లు, అరటితో పాటు టేకు మొక్కలను నాటారు. బెండకాయ, గోంగూర, ఆకుకూరలనూ సాగు చేస్తున్నారు. ఈ పంటలకు డ్రిప్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కోళ్లకు, పంటలకు కలిపి మొత్తం రూ.5 లక్షల పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. ‘‘వ్యవసాయంలో కొన్నిసార్లు అప్పులే మిగిలాయి. మా కాళ్లపై మేము నిలబడాలని ఉద్యాన పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. నాటుకోళ్లు పెంచుతున్నాం’’ అని జమలయ్య, జ్యోతి తెలిపారు.

చేపల పెంపకంతో కొత్త తోవ

ఆర్‌ఏఎస్‌ విధానంలో ఉత్పత్తి

ర్‌ఏఎస్‌ విధానంలో శుభ్రమైన నీటిలో చేపల పెంపకం చేపడుతూ ఆరేళ్లుగా లాభాలు గడిస్తున్నారు విశ్వనాథరాజు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆయన 1987లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 2001లో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడు శివారులోని తన పొలంలో 2015లో ‘ఆర్‌ఏఎస్‌’ పద్ధతిలో చేపల పెంపకం ప్రారంభించారు.

ఆఫ్రికాలో పరిశీలించి..

ఆఫ్రికా ఖండంలోని బెనిన్‌ దేశానికి వెళ్లినప్పుడు ఈ ‘రీ సర్క్యులేటింగ్‌ ఆక్వాకల్చర్‌ విధానం’ (ఆర్‌ఏఎస్‌) ద్వారా చేపల సాగు తీరును ఆయన పరిశీలించారు. దీన్ని తానూ ఆచరణలోకి పెట్టాలని నిర్ణయించుకున్నారు. గుండేడులో పావు ఎకరా స్థలంలో డ్రమ్‌ ఫిల్టర్లను స్వయంగా డిజైన్‌ చేసుకున్నారు. మొదట్లో రూ.1.50 కోట్ల పెట్టుబడి పెట్టారు. అందులో రూ.30 లక్షలతో షెడ్డు, డ్రమ్‌ ఫిల్టర్‌, బయో ఫిల్టర్‌, ఓజోన్‌ వాటర్‌ లిఫ్టింగ్‌ పంపులు, ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్‌ఏఎస్‌ విధానంలో నీరు గ్రావిటీ ద్వారా ప్రవహించడం వల్ల విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది. చేపల నుంచి వచ్చే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా పెరుగుతాయి. అల్ట్రా వయోలెట్‌ కిరణాలను ఉపయోగించి రసాయనాలు లేని చేపల ఉత్పత్తిని ప్రారంభించారు విశ్వనాథరాజు. పంగాస్‌, తెలాపియా, రూప్‌చంద్‌, దేశీమాగు, పాబ్‌దా, సింగీ వంటి చేపలను పెంచుతున్నారు. ఏటా 50-60 టన్నుల చేపల ఉత్పత్తితో రూ.1.40 కోట్ల టర్నోవర్‌ ఉంటోందని, అన్ని ఖర్చులు పోనూ రూ. 60-70 లక్షల వరకు మిగులుతాయని విశ్వనాథరాజు తెలిపారు. ఆర్‌ఏఎస్‌ విధానంలో తక్కువ నీటి సౌకర్యంతో, తక్కువ స్థలంలో కూలీల ఖర్చులు లేకుండా చేపల వ్యాపారం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఔత్సాహికులకు అవగాహన

ఆర్‌ఏఎస్‌ విధానంపై ఔత్సాహికులకు గుండేడ్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి నెలా 15వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవగాహన కల్పిస్తున్నారు. శంకర్‌పల్లిలోని తన అర్బన్‌ ఫిష్‌ సెంటర్‌ ద్వారా చేపలు విక్రయిస్తున్నారు.

సీమ నేలలో యాపిల్‌

సీమ నేలలో యాపిల్‌

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లెకు చెందిన రైతు శంకర్‌రెడ్డి గతంలో వేరుసెనగ, చెరకు, పూలు సాగు చేశారు. ప్రస్తుతం యాపిల్‌ పండిస్తున్నారు. శీతల వాతావరణంలో పండే యాపిల్‌ వేడి ప్రాంతమైన రాయలసీమలో ప్రయోగాత్మకంగా వేశారు. పంజాబ్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సరీ నుంచి అన్నా, రెడ్‌ డెలీషియస్‌, హెచ్‌ఆర్‌ఎంఎన్‌-99 (హరిమాన్‌) అనే మూడు రకాలను మూడేసి మొక్కల చొప్పున తెచ్చారు. వాటిని 2020 నవంబరులో నాటారు. హరిమాన్‌ రకం 2021 మార్చికల్లా పూత దశకు వచ్చింది. సుమారు 140 రోజుల వ్యవధిలో ఆగస్టుకల్లా చేతికొచ్చింది. ఎకరాకు 300 నుంచి 450 మొక్కల వరకు నాటుకోవచ్చని శంకర్‌రెడ్డి తెలిపారు. యాపిల్‌ సాగుకు నీటి అవసరం తక్కువ. పిందె నుంచి కాయ దశ వరకు వాతావరణాన్ని బట్టి నీటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. పంట కాలం ముగిశాక నీటి యాజమాన్య పద్ధతులు పెద్దగా అవసరం లేదు. తక్కువ మొక్కలు కాబట్టి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టలేదని, చీడపీడలు ఆశించలేదని శంకర్‌రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.