ETV Bharat / city

Uttam on paddy procurement: 'యాసంగిలో వరి పంటపై ఆంక్షలు లేకుండా చూడాలి' - uttam kumar reddy on paddy procurement in lok sabha

Uttam on paddy procurement: యాసంగిలో వరి పంటపై ఆంక్షలు లేకుండా చూడటం సహా వానాకాలం పంటను త్వరగా కొనుగోలు చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై లోకసభ జీరో అవర్‌లో మాట్లాడిన ఉత్తమ్‌....తెరాస ఎంపీలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వానాకాలం పంటను కొనిపించాలని కోరారు.

MP Uttam on paddy procurement:
ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి
author img

By

Published : Dec 1, 2021, 2:54 PM IST

Uttam on paddy procurement: తెలంగాణలో యాసంగిలో వరి పంటపై ఆంక్షలు లేకుండా చూడాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా వానాకాలం పంటను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటు సమావేశాల్లో లోక్​సభ జీరో అవర్​లో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో వెంటనే వానాకాలం పంటను కొనాలి. యాసంగిలో వరి పంటపై ఆంక్షలు లేకుండా చూడాలి. తెరాస ఎంపీలు సీఎం కేసీఆర్‌తో పంటను కొనిపించాలి. -ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నల్గొండ ఎంపీ

రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్​ అన్నారు. తెరాస ఎంపీలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వానాకాలం పంటను కొనిపించాలని కోరారు.

యాసంగిలో వరి పంటపై ఆంక్షలు లేకుండా చూడాలి: ఉత్తమ్​

కేంద్రం ప్రకటన

ఈ క్రమంలో వరిసాగు, ధాన్యం సేకరణపై భాజపా నేతలు, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణపై తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు.. కేంద్ర ఆహార, ప్రజాసరఫరాల మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో సేకరించిన ధాన్యం వివరాలు వెల్లడించింది.

తెలంగాణలో 2018-19లో 51.90 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20లో 74.54 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2020-21లో 94.53 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరణ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ నుంచి 2018-19లో 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20లో 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2020-21లో 56.67 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు చెప్పింది.

ఇదీ చదవండి: CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'

paddy procurement: ధాన్యం సేకరణపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.