National Farmers day: ధాన్యం కొనుగోళ్లలో స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరినా .. కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగులో రాష్ట్రం అద్వితీయ ప్రగతి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
నిజాలు తెలుసుకుందాం
KTR wishes on National Farmers day: ఆహారధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డులు తిరగరాసిందని కేటీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోలులో నిజాలు ఏమిటో తెలుసుకుందామంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశామని తెలిపారు. అన్నదాతలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని.. రాష్ట్ర బాగుంటే దేశం బాగుంటుంది అనేదే తమ విధానమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Telangana Government: 'డిండి ఎత్తిపోతల పథకం పనులను ఇక చేపట్టబోం'