ETV Bharat / city

Harish Rao on Omicron: 'ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం' - తెలంగాణలో ఒమిక్రాన్

Harish Rao on Omicron: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆరోగ్య మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీకాల విషయంలో నిరాసక్తత పనికిరాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరు తప్పక రెండు డోసులు తీసుకోవాలని.. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Harish Rao on Omicron, omicron cases, బస్తీ దవాఖానా, మంత్రి హరీశ్ రావు, ఒమిక్రాన్
ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం
author img

By

Published : Dec 3, 2021, 12:32 PM IST

Micron Variant news Today : కొత్త వేరియంట్ భారత్​లోకి ప్రవేశించిందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా టీకా.. మాస్కులు ధరించడంతో ఒమిక్రాన్​ను కట్టడి చేయవచ్చని చెప్పారు.

Basti Dawakhana in Bowenpally: జీహెచ్​ఎంసీ పరిధిలో బస్తీ ప్రజల జబ్బులకు జవాబుగా నిలుస్తున్న బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పుడున్న 226కు అదనంగా 32 ఆసుపత్రులను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 258కి పెరగ్గా.... ఈ నెలాఖరు లోగా మరో 7 దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. హైదరాబాద్​ ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌ ఫిరోజ్‌గూడ బస్తీ దవాఖానాలను హరీశ్‌రావు ప్రారంభించారు. త్వరలో జిల్లాల్లోనూ బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు వృథా చేసుకోవద్దని బస్తీ దవాఖానాలు వినియోగించుకోవాలని సూచించారు.

Minister Harish Rao: "అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా రెండు డోసులు తీసుకోవాలి. మన టీకాలు అత్యంత సురక్షితమైనవి. అపోహలు లేకుండా అందరూ టీకా వేయించుకోవాలి. టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. ప్రజలకు కావాల్సిన టీకా నిల్వలు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళన చెందొద్దు. మనరాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవు. కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలో పరీక్షలు. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళకు పాజిటివ్ వచ్చింది. మహిళ నమూనాలు జినోమ్ సీక్వెన్స్‌కు పంపాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఒమిక్రాన్‌ను తరిమికొట్టాలి."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

Omicron Cases Updates : రాష్ట్రంలోకి ఒమిక్రాన్​ ప్రవేశిస్తే కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. ఒకవేళ కట్టడి చేసేలోగానే వ్యాప్తి చెందితే బాధితులకు సరిపడా పడకలు, వసతులు, చికిత్స, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. 27 వేల పడకలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్​లో 4 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని అన్నారు. వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి వివరించారు.

ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.