ETV Bharat / city

CM KCR AT IAMC Conference : 'మధ్యవర్తిత్వం వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది'

CM KCR AT IAMC Conference : హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని చెప్పారు.

CM KCR AT IAMC Conference, CM KCR, సీఎం కేసీఆర్, ఐఏఎంసీ సదస్సు
CM KCR AT IAMC Conference
author img

By

Published : Dec 4, 2021, 11:53 AM IST

మధ్యవర్తిత్వం వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది

CM KCR AT IAMC Conference : హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్​ అన్ని విధాలా అనువైన ప్రాంతమని తెలిపారు. ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించినట్లు చెప్పారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని వెల్లడించారు.

IAMC Conference Today : హైదరాబాద్​లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కలిసి సీఎం పాల్గొన్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు

"ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ధన్యవాదాలు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం."

- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి :

IAMC conference 2021 : హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సదస్సు ప్రారంభమైంది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ప్రక్రియ, వినియోగదారుల అంచనాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.