ETV Bharat / city

Central About Paddy Procurement : 'ఏ రాష్ట్రం నుంచీ ధాన్యం సేకరణ ఆపలేదు' - పార్లమెంటులో తెలంగాణ

Central About Paddy Procurement : ఏ రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణ ఆపలేదని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు యోచన లేదని తేల్చిచెప్పింది. విభజన చట్టంలోని కొన్ని ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం అవసరం అని అభిప్రాయపడింది.

Central About Paddy Procurement
Central About Paddy Procurement
author img

By

Published : Dec 16, 2021, 8:10 AM IST

Central About Paddy Procurement : దేశంలో ఏ రాష్ట్రం నుంచీ కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరణను ఆపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ అక్టోబరు నుంచి ప్రారంభమైందని, డిసెంబరు 8 వరకు కేంద్ర పూల్‌కు 326 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని పేర్కొంది. అత్యధికంగా పంజాబ్‌ నుంచి 186.86 ల.మె.ట., హరియాణా నుంచి 55.31 ల.మె.ట., తర్వాత తెలంగాణ నుంచి 32.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సెంట్రల్‌ పూల్‌కు సేకరించినట్లు తెలిపారు. బుధవారం లోక్‌సభలో తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి సమాధానాలు ఇచ్చారు.

Telangana in Parliament 2021 : ‘‘ఈ ఏడాది ఖరీఫ్‌లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించాలని ఆగస్టు 17న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల మిగులు బియ్యాన్ని ఉప్పుడు బియ్యం రూపంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేయడానికి, మిగిలిన బియ్యాన్ని ముడి బియ్యం రూపంలో అందించడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. తర్వాత చేసిన మరో విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నులను ఉప్పుడు బియ్యం రూపంలో తీసుకోవడానికి అంగీకరించింది. అందులో భాగంగా భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వం అక్టోబరు 4న లేఖ ఇచ్చింది.’’

- సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన

Parliament Winter Sessions 2021 : విభజన చట్టంలోని కొన్ని ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం అవసరం అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సూచించారు. బుధవారం రాజ్యసభలో విభజన చట్టం అమలుపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు యోచన లేదు

Central On Karimnagar IIIT : కరీంనగర్‌లో పీపీపీ విధానంలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో తెరాస సభ్యుడు కేఆర్‌ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఇప్పటికే పలు కేంద్ర విద్యాసంస్థలున్నాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.