Banks Strike Today : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణలోనూ కొనసాగుతోంది. రెండ్రోజుల పాటు ఉద్యోగుల చేయనున్న ఈ సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులూ సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. బ్యాంకింగ్ చట్ట సవరణ ఆపాలని రాష్ట్ర బ్యాంకర్ల సంఘం డిమాండ్ చేసింది. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ చట్ట సవరణ ఆపాలని నినాదాలు చేశారు.
సర్కార్ దిగిరాకపోతే నిరవధిక సమ్మె..
Banks Strikes in Hyderabad : సమ్మెలో భాగంగా.. హైదరాబాద్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. విధులు బహిష్కరించిన ఉద్యోగులు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్ అమెండ్‌మెంట్ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజుల సమ్మె తోనైనా కేంద్ర ప్రభుత్వం దిగిరాక పోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
ఆందోళన ఉద్ధృతం చేస్తాం..
Public Sector Banks Strike Telangana: యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే 2008లో ఏవిధంగా అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందో అదే తరహాలో మరో సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. కేంద్రం తక్షణమే ఈ చట్ట సవరణ ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు.