CM Jagan announcement on PRC : ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు.
PRC for AP Employees : అంతకుముందు.. తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో సీఎం ఎదుట ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ఉద్యోగులు.. పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరారు. పీఆర్సీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత తిరుపతి శ్రీకృష్ణనగర్ నుంచి పాడిపేటకు సీఎం జగన్ బయల్దేరారు.
ఇవీ చదవండి :
ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే ఉద్యోగులతో పలుమార్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. ఐఆర్ ప్రకటించామని.. మిగిలిన అంశాలపై ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Pay Revision Commission : వేతన సవరణపై ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించాయి. ఈ నెల 28లోగా పీఆర్‌సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి.. సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ తాము పీఆర్‌సీ నివేదిక మాత్రమే అడిగామని.. నెలాఖరులోగా వేతన సవరణ కూడా ప్రకటించాలని వెల్లడించాయి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
PRC for AP Employees : పీఆర్సీని ఈ నెలాఖరులోగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సమయమిచ్చాయి. ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో... 28న ఉమ్మడి సమావేశం తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నికలకు ముందు ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఈ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉద్యోగులంతా ఉద్యమానికి దిగే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి