భారీ వర్షాలు, వరదల్లో విద్యార్హత ధ్రువపత్రాలు కొట్టుకుపోయినా, తడిసి దెబ్బతిన్నా... ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి కొత్త ధ్రువపత్రాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్హత ధ్రువపత్రాలు పోయాయని వందలాది విద్యార్థులు ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కొత్త ధ్రువపత్రాలు అవసరమైన వారు ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు.
పేరు, ధ్రువపత్రం, హాల్ టికెట్, పరీక్ష పాసైన సంవత్సరం వివరాలు సమర్పిస్తే కొత్త ధ్రువపత్రాలు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా కొత్తవి లేదా డుప్లికేట్ ధ్రువపత్రాలు ఇవ్వాలని పాఠశాల, ఇంటర్మీడియట్, సాంకేతిక విద్యా శాఖలతో పాటు... యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చూడండి: రంగారెడ్డి జిల్లాలో హై అలర్ట్ ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు