ETV Bharat / city

'కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి మొండి చేయి'

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత లేకుండా పోయింది. విభజన చట్టంలోని పలు ప్రాజెక్టులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథ, కాకతీయలకు ఆర్థిక సహాయం వంటి అంశాలు బడ్జెట్​లో ఎక్కడా ప్రస్తావన లేదు. హైదరాబాద్ ఐఐటీ, మణుగురు భారజల కేంద్రం, సింగరేణి కాలరీస్​కు నిధుల ప్రతిపాదనలు మాత్రమే బడ్జెట్​లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేటాయింపుల లేకపోవడంతో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్​పై పెదవి విరిచాయి.

author img

By

Published : Jul 5, 2019, 10:06 PM IST

Updated : Jul 5, 2019, 11:58 PM IST

budget

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ... ఇవాళతొలి బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన పద్దు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కుకర్మాగారం, ఖాజీపేటలో రైల్వేకోచ్ ప్యాక్టరీ తదితరాల ఊసే లేదు. బడ్జెట్ పూర్తి స్థాయిలో నిరాశాజనకంగానే ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

వడ్డి రాయితీ ఏదీ

రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాగా కేంద్రం నుంచి 19వేలా 719కోట్ల రూపాయలు రానున్నాయి. 2018-19 సవరించిన బడ్జెట్​లో ఈ మొత్తం 18వేలా 561 కోట్ల రూపాయలు. అంటే కేవలం 1,157 కోట్లు మాత్రమే ఎక్కువ. ఇదే సమయంలో కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో పేర్కొన్న పన్నుల వాటా కంటె 864కోట్ల రూపాయలు తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే పారిశ్రామిక యూనిట్లకు ఇచ్చే వడ్డి రాయితీని ఈ ఏడాది బడ్జెట్​లో కేటాయించలేదు. గతేడాది రెండు తెలుగురాష్ట్రాలకు కలిపి రూ.100 కోట్లు ప్రతిపాదించినా అంచనాల సవరణ నాటికి దక్కింది మాత్రం శూన్యమే.

విద్యాలయాలకు తక్కువే

తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి 4 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా రుణం, వడ్డీ చెల్లింపు కోసం 25 లక్షల రూపాయలు ప్రతిపాదించారు. గతేడాది 10 కోట్ల రూపాయలు కేటాయించినా అంచనాల సవరణ నాటికి అది 50 లక్షలకే పరిమితమైంది. హైదరాబాద్ ఐఐటీకి 80 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. గతేడాది 75 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి ఏమీ ఇవ్వలేదు. హైదరాబాద్​లోని అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ రీసెర్చికి 319 కోట్లు కేటాయించారు.

మొత్తంలో కొంత...

సింగరేణి కాలరీస్ సంస్థకు 1,850 కోట్లు కేటాయించారు. దేశంలోని మ్యూజియంలన్నింటికీ 313.8 కోట్ల రూపాయలను కేటాయించగా ఇందులో కొంత వాటా సాలార్ జంగ్ మ్యూజియంకు దక్కనుంది. దేశంలోని సీడ్యాక్​లన్నింటికీ కలిపి 120 కోట్లు కేటాయించారు. అందులో భాగ్యనగరానికి కొంత దక్కనుంది. హైదరాబాద్​లోని నేషనల్ ఫిషనరీస్ బోర్డుకు 80.75 కోట్లు, మణుగూరు భారజల కేంద్రానికి 50.38 కోట్లు ప్రతిపాదించారు. స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు, ఇతర ప్రయోజనాల కోసం 952.81 కోట్లు ప్రతిపాదించగా ఇందులో కొంత మొత్తం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు దక్కనుంది.

ప్రత్యేక కేటాయింపులు లేవు

ఇవిపోగా రాష్ట్రానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. వివిధ శాఖలకు గంపగుత్తగా నిధులు కేటాయించినట్లు తెలుస్తుండగా... వాటిలో రాష్ట్రంలోని సంస్థలకు ఏ మేరకు దక్కుతాయోనన్నది స్పష్టత లేదు. మొత్తంగా కేంద్ర బడ్జెట్​లోని ప్రతిపాదనలు చూస్తే తెలుగు రాష్ట్రాలకు, సంస్థలకు నిధుల కేటాయించకపోవడం పట్ల రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: దేశానికే కేసీఆర్‌ దిక్సూచి: ట్విట్టర్‌లో కేటీఆర్‌

File Name: TG_HYD_Del_02_05_BUDGET_TO_TELANGANA_PKG_DRY_3181995  ( ) కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపై స్పష్టత కరవైంది. 2019-20 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత లేకుండా పోయింది. విభజన చట్టంలోని పలు ప్రాజెక్టులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథ, కాకతీయలకు ఆర్థిక సహాయం  వంటి అంశాలు బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావన లేదు. హైదరాబాద్ ఐఐటీ, మణుగురు భారజల కేంద్రం, సింగరేణి కాలరీస్ కు నిధుల ప్రతిపాదనలు మాత్రమే బడ్జెట్ లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేటాయింపుల లేకపోవడంతో  అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచాయి. LOOK     VO1: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే.. శుక్రవారం తొలి బడ్జెట్‌ ను లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌  తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు  అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఇరు రాష్ట్రాలకు చుక్కెదురైంది. దేశంలో ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌లు ఐఐఎం, ఎన్ఐటి, ఐఐటి వంటి సంస్థ‌ల‌న్నింటికి క‌లిపి వేల కో్ట్ల‌ నిదులు కేటాయించినా... అందులో తెలంగాణలో నెల‌కొల్పిన విద్యాసంస్థలకు ఎంత దక్కుతుందో తెలియని గందరగోళం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే పారిశ్రామిక యూనిట్లకు ఇచ్చే వడ్డిరాయితీని ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించలేదు. గతేడాది రెండు తెలుగురాష్ట్రాలకు కలిపి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించినా అంచనాల సవరణ నాటికి దక్కింది మాత్రం శూన్యమే. గతేడాదితో పోలిస్తే తెెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన, నెలకొల్పనున్న సంస్థలకు కేటాయింపులు చూస్తే గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలనికి 4 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా రుణం, వడ్డీ చెల్లింపు కోసం 25 లక్షల రూపాయలు ప్రతిపాదించారు. గతేడాది 10 కోట్ల రూపాయలు కేటాయించినా అంచనాల సవరణ నాటికి అది అర కోటి రూపాయలకే పరిమితమైంది. ఈ బడ్జెట్ లో హైదరాబాద్ ఐఐటీకి 80 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. గతేడాది 75 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి ఏమీ ఇవ్వలేదు. సింగరేణి కాలరీస్ సంస్థకు  వెయ్యి 850 కోట్లు కేటాయించారు. గతేడాది 2 వేల కోట్ల రూపాయలను కేటాయించినా అంచనాల సవరణ నాటికి 11 వందల కోట్లకే పరిమితమైంది. దేశంలోని మ్యూజియంలన్నింటికీ 313.8 కోట్ల రూపాయలను కేటాయించగా ఇందులో కొంత వాటా సాలార్ జంగ్ మ్యూజియంకు దక్కనుంది. హైదరాబాద్ లోని అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ రీసెర్చికి 319 కోట్లు కేటాయించారు. దేశంలోని సీడ్యాక్ లన్నింటికీ కలిపి 120 కోట్లు కేటాయించారు. అందులో హైదరాబాద్ కు కొంత దక్కనుంది. హైదరాబాద్ లోని నేషనల్ ఫిషనరీస్ బోర్డుకు 80.75 కోట్లు, మణుగూరు భారజల కేంద్రానికి 50.38 కోట్లు ప్రతిపాదించారు. స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు, ఇతర ప్రయోజనాల కోసం 952.81 కోట్లు ప్రతిపాదించగా ఇందులో కొంత మొత్తం హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు దక్కనుంది. ఇవిపోగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. వివిధ శాఖలకు గంపగుత్తగా నిధులు కేటాయించినట్లు తెలుస్తుండగా... వాటిలో రాష్ట్రంలోని సంస్థలకు ఏ మేరకు దక్కుతాయోనన్నది స్పష్టత లేదు. SPOT EVO: మొత్తంగా కేంద్ర బడ్జెట్ లోని ప్రతిపాదనలు చూస్తే తెలుగు రాష్ట్రాలకు, సంస్థలకు నిధుల కేటాయించకపోవడం పట్ల రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు కేంద్ర మొండిచేయి చూపిందని.. నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతుందని తెరాస, వైకాపా, కాంగ్రెస్ ఆరోపించాయి. END 
Last Updated : Jul 5, 2019, 11:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.