ETV Bharat / city

KTR Tweet Today : 'అన్నింట్లో తెలంగాణకు అన్యాయమే' - కేంద్రంపై కేటీఆర్ ట్వీట్

KTR Tweet Today : కేంద్ర సర్కార్‌ విధానాలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ బాణాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు, ఇవ్వాల్సిన కేటాయింపులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన సంప్రదాయ వైద్య కేంద్రం.. గుజరాత్‌కు తరలిపోవడం గురించి మండిపడుతూ గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్‌కు రీట్వీట్ చేశారు.

KTR Tweet Today
KTR Tweet Today
author img

By

Published : Apr 20, 2022, 9:21 AM IST

KTR Tweet Today : కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందని మరోసారి రుజువైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందని మండిపడ్డారు. సంప్రదాయ వైద్య కేంద్రంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ... ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు సున్నా అని కేటీఆర్ అన్నారు. ఐఐఎస్ఈఆర్‌లు 2 కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏం లేదని మండిపడ్డారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఐడీలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ తెలంగాణకు సున్నా అని, 84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ట్వీటారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని విస్మరించారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

  • Congratulations to Kishan Reddy Ji, Cabinet Minister in NPA Govt on bringing a prestigious national institute to the state 👏

    Oh wait!! As usual, the PM of Gujarat decided that it should move to Jamnagar

    The saga of Modi Ji’s discrimination against Telangana goes on unabated👇 pic.twitter.com/Du1mMzXjJE

    — KTR (@KTRTRS) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.