ETV Bharat / city

టెలిగ్రామ్​కు క్యూ కట్టిన యూజర్లు - dummy

వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ సేవలకు అంతరాయం టెలిగ్రామ్​కు బాగా కలిసొచ్చింది. సేవలు నిలిచిన ఆ 7గంటల సమయంలోనే 7 కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్​ వైపు మళ్లారు.

టెలిగ్రామ్​కు క్యూ కట్టిన యూజర్లు
టెలిగ్రామ్​కు క్యూ కట్టిన యూజర్లు
author img

By

Published : Oct 7, 2021, 1:00 PM IST

ఈ పోటీ ప్ర‌పంచంలో గెల‌వ‌డ‌మే కాదు.. ఆ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డ‌మూ ముఖ్య‌మే. టాప్‌లో ఉన్న వాళ్లు ఏమాత్రం త‌డ‌బ‌డినా కింద ఉన్న వాళ్లు ఆ స్థానాన్ని అందుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న కాల‌మిది. ప్ర‌స్తుతం మెసేజింగ్ యాప్స్ వాట్సాప్‌, టెలిగ్రామ్‌( Telegram )ల‌ను చూస్తే ఈ విష‌యం తెలుస్తుంది. వాట్సాప్ త‌ప్పిదాలు ప్ర‌త్య‌ర్థి టెలిగ్రామ్‌కు బాగా క‌లిసొస్తున్నాయి. ఒకేసారి వాట్సాప్ సేవ‌లు ఏడు గంట‌ల పాటు నిలిచిపోవ‌డంతో టెలిగ్రామ్ మ‌రోసారి పండ‌గ చేసుకుంది. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 7 కోట్ల మంది కొత్త యూజ‌ర్ల‌ను టెలిగ్రామ్ సంపాదించ‌ుకుంది. ఫేస్​బుక్​, వాట్సాప్ సేవల్లో అంతరాయం స‌మ‌యంలో త‌మ‌కు కొత్త‌గా 7 కోట్ల మంది యూజ‌ర్లు వ‌చ్చిన‌ట్లు టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 100 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. అందులో 50 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.