రాష్ట్రంలో.. రానున్న మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని ప్రకటించింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఇవీ చదవండి :
- TS WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు మోస్తరు వర్షాలు
- FLOOD: గోదావరికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు
తీవ్ర అల్పపీడనం బంగ్లాదేశ్ పరిసర పశ్చిమ బంగాల్ ప్రాంతాల మీదుగా స్థిరంగా సాగుతోందని అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పీయార్ వరకు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. రాగల 48 గంటల్లో ఇది పశ్చిమ దిశగా కదులుతూ పశ్చిమ బంగాల్, ఝూర్ఘండ్, బిహార్ మీదుగా వెళ్లే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు వెల్లడించారు.