ETV Bharat / city

Vaccination: కొత్తవాళ్లకు నో వ్యాక్సిన్​.. ఇన్​టైమ్​లో దొరకని సెకండ్​డోస్​ - telangana vaccination news

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై దాదాపు ఏడునెలలు కావొస్తున్నా... ఇప్పటి వరకు టీకాలు ఇచ్చింది కేవలం 1,15,46,546 మందికి మాత్రమే. అంటే కేవలం 50% మందికి మాత్రమే రాష్ట్రంలో పూర్తి లేక పాక్షిక వ్యాక్సినేషన్ పూర్తయింది. అందులోనూ రెండు డోసులు పూర్తయిన వారు 40 లక్షల లోపే ఉండటం గమనార్హం. గడువు పూర్తయిన రెండో డోస్ దొరక్క టీకా కేంద్రాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి. మరోవైపు మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో వ్యాక్సినేషన్​ని వేగవంతం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TS Vaccination
TS Vaccination
author img

By

Published : Aug 7, 2021, 3:56 PM IST

మహమ్మారి కరోనాని నిలువరించేదేందుకు వ్యాక్సినేషనే ఉత్తమమైన మార్గమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే 18 ఏళ్లు పై బడిన వారందరికీ దశలవారీగా టీకాలు అందించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏడాది జనవరి 16 నుంచి టీకా పంపిణీ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు.

ఏడు నెలలు గడుస్తున్నా...

రాష్ట్రంలో సుమారు 2.2 కోట్ల మంది టీకా తీసుకునేందుకు అర్హులుగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఏడు నెలలు గడుస్తున్నా ... సుమారు యాభై శాతం మందికి మాత్రమే టీకా అందించారు. అంటే 1,15,46,546 మందికి ఇప్పటి వరకు టీకా ఇవ్వగా... అందులోనూ రెండు డోసు పూర్తయింది కేవలం 38,27,849 మందికి మాత్రమే. అంటే రాష్ట్రంలో మరో 77,18,697 మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో పూర్తి లేక పాక్షిక రక్షణ లభించింది కేవలం 1,15,46,546 మందికి మాత్రమే. మరో 1,04,53,454 మందికి ఇప్పటి వరకు కనీసం ఒక్కడోస్ టీకా కూడా అందకపోవటం గమనార్హం.

రోజుకి 1.33లక్షల మందికి టీకాలు

ఇక జులై మాసంలో మొత్తం 41లక్షల 36 వేల 263మందికి టీకా అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకి 1.33లక్షల మందికి టీకాలు అందించారు. వ్యాక్సినేషన్ ఇదే పరంపరంలో కొనసాగితే అందిరికీ టీకా ఇచ్చేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా మూడో వేవ్ వస్తే టీకా అందని వారి పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

టీకా కోసం వెయింటింగ్...

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఒకడోస్ పూర్తయి రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు... వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాల్సిన పరిస్థితి. టీకాలు అందుబాటుని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే కొవిషిల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 14 నుంచి 16 వారాలుగా నిర్ణయించింది. అయితే ఆ సమయం దాటినా అనేక మందికి టీకాలు అందని పరిస్థితి. రోజుల తరబడి వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ తిరిగినా రెండో డోస్ అందని దుస్థితి. అనేక చోట్ల రోజుకి వంద మందికి మాత్రమే రెండో డోస్ ఇస్తుండగా కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రారంభమైన గంట రెండు గంటల్లోనే టీకా కొరత ఏర్పడుతున్న పరిస్థితి. ఫలితంగా గంటల కొద్దీ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఎదురు చూసి నిరాశతో వెనుదిరాగాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం రెండో డోస్​పై దృష్టి

గత నెలలో సుమారు 30 లక్షల మందికి రెండో డోస్ టీకా ఇవ్వాల్సి ఉండగా ... కేవలం 22 లక్షల 23వేల 904 మందికి రెండో డోస్ టీకా అందించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో డోస్​పై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి ఆగస్టులో రెండో డోస్ పూర్తిచేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కొవిడ్ రెండో వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వందల మందిని బలితీసుకుంది. వేలాది మందిని ఆస్పత్రులపాలు చేసింది. మూడో వేవ్ ముంచుకొస్తుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో వ్యాక్సినేషన్​ని మరింత వేగవంగం చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.