పారదర్శకత పాటించే అంశంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి దేశంలో తొలిస్థానంలో నిలిస్తే ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ మండళ్లు ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో, మాన్యువల్‌గా పెద్దఎత్తున డేటా సేకరిస్తున్నప్పటికీ వాటిని ప్రజాబాహుళ్యానికి వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నాయి.
ఏయే రాష్ట్రాలు తమ ప్రజలకు అధిక సమాచారాన్ని అందిస్తున్నాయన్న విషయమై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో 67% మార్కులతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఒడిశాతో కలిసి తొలి స్థానాన్ని ఆక్రమించగా, 52% మార్కులతో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానానికి పరిమితమైంది.