ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9PM
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jan 7, 2022, 8:58 PM IST

  • రాష్ట్రంలో కరోనా విజృంభణ

Covid Cases in Telangana: రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రోజువారీ కేసులు కొన్నినెలల తర్వాత 2వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా... 2,295 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది.

  • తెరాస నుంచి రాఘవ సస్పెన్షన్​

Vanama Raghava Suspended: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, తెరాస నేత వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు తెరాస ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో రాఘవను సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

  • 'రాష్ట్రంలో ఈ-పాలనతో పాటు మొబైల్​-గవర్నెన్స్​కూ ప్రాధాన్యత'

KTR at E-Governance 2022: ఈ-గవర్నెన్స్​తో పాటు తెలంగాణ రాష్ట్రం.. మొబైల్-గవర్నెన్స్​కు కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ-గవర్నెన్స్​ 2022 జాతీయ సదస్సులో మాట్లాడారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న కేటీఆర్.. ఐటీఆర్​ ప్రాజెక్టు గురించి కేంద్రం పునరాలోచించాలని కోరారు.

  • 'కేసీఆర్ లాంటి పిరికి సీఎంను ఎక్కడా చూడలేదు'

Shivraj Singh Chouhan on KCR: తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైందని భాజపా జాతీయ నేత, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బండి సంజయ్‌ పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కేసీఆర్​ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడ చూడలేదని ఆయన అన్నారు.

  • ఒక్కరోజులోనే కరోనా కేసులు డబుల్

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

  • 'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్​ తప్పనిసరి'

Home Quarantine: భారత్​కు వచ్చిన ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్​ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కేసులు

worldwide covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. గురువారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, భారత్​, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

  • 'మూడో టెస్టుకు కోహ్లీ.. వారిద్దరూ వేచి చూడాల్సిందే'

Rahul Dravid on Vihari: టీమ్​ఇండియాలో సీనియర్​ ఆటగాళ్లు ఉన్నంతకాలం హనుమ విహారి, శ్రేయస్​ అయ్యర్ అవకాశాల కోసం వేచి చూడాల్సి ఉంటుందని హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. మూడో టెస్టులో కోహ్లీ అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు.

  • విజయ్‌ దేవరకొండ, సల్మాన్‌ చిత్రాల షూట్‌ వాయిదా

Vijay Deverakonda Liger: సినిమా రిలీజ్​లపైనే కాదు.. షూటింగ్​లపైనా ప్రభావం చూపుతోంది కొవిడ్​. విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'లైగర్', సల్మాన్​ ఖాన్ 'టైగర్'​ చిత్రీకరణలకు ఆటంకం కలిగించింది కరోనా. ఈ రెండు చిత్రాల షూటింగ్​ ప్రస్తుతానికి నిలిచిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.