ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9PM
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jan 2, 2022, 8:56 PM IST

  • రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్​

Telangana omicron cases:తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84కి చేరింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 32 మంది కోలుకున్నారు.

  • 'వర్ధమాన పాత్రికేయులకు అరుణ్​సాగర్‌ ఒక స్ఫూర్తి'

ArunSagar Awards 2022: పాత్రికేయ, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా అందజేసే అరుణ్​సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాల వేడుక హైదరాబాద్​లో అట్టహాసంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయగా... పాత్రికేయ రంగంలో ఈనాడు ఏపీ సంపాదకులు మానుకొండ నాగేశ్వర్ రావు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని అందుకున్నారు.

  • త్వరలో యాదాద్రికి సీఎం కేసీఆర్​

CM KCR visit to Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంక్రాంతి పర్వదినం తర్వాత కేసీఆర్​.. యాదాద్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • విశాఖలో విషాదం

Visakha RK beach: హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లిన విహారయాత్ర విషాదాంతమైంది. ఆర్కే బీచ్​లో స్నానానికి దిగి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన 8మంది స్నేహితులు ఈనెల 30న కాచిగూడ నుంచి ట్రైన్​లో విశాఖ బయలుదేరి వెళ్లారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు... సముద్రంలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

  • 'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు'

Vaccination Children: 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్​ మిక్సింగ్​ గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు.. ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

  • ముంబయిలో ఒక్కరోజే 8వేల కరోనా కేసులు

Mumbai Covid Cases: భారత్​లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క ముంబయిలోనే 8 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. బంగాల్​లో ఒక్కరోజే 6 వేలమందికిపైగా వైరస్​ సోకింది. దిల్లీలో 3194, కేరళలో 2802, కర్ణాటకలో 1187 కేసులు నమోదయ్యాయి.

  • ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?

Omicron Natural vaccine: ఒమిక్రాన్ వ్యాప్తి మంచిదేనా? ఈ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్​లా పనిచేసి కొవిడ్​ను అంతం చేస్తుందా? మహారాష్ట్ర వైద్యాధికారి చేసిన పలు వ్యాఖ్యలతో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనేం చెప్పారు? దీనిపై ఇతర నిపుణులు ఏమన్నారు? ఓసారి చూస్తే...

  • భార్యా పిల్లల్ని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Bank Employee suicide: ఓవైపు అప్పుల బెడద.. మరోవైపు ఇంటి ఇల్లాలితో గొడవ.. ఈ సమస్యలతో కొట్టుమిట్టాడలేక తనువు చాలించాడు ఓ బ్యాంకు ఉద్యోగి. చనిపోయే ముందు భార్య, పిల్లలను హత్య చేశాడు. తమిళనాడులో జరిగింది ఈ ఘటన.

  • ఫుట్​బాల్​ స్టార్​ మెస్సీకి కరోనా

Lionel Messi Covid: అర్జెంటినా ఫుట్​బాల్ స్టార్ లియోనాల్​ మెస్సీకి కరోనా సోకింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలిందని పీఎస్​జీ ఫుట్​బాల్​ క్లబ్ పేర్కొంది.

  • 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్​' విడుదల తేదీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.