ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@5PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​@5PM
టాప్​ టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Jan 1, 2022, 4:59 PM IST

  • న్యూఇయర్​ వేళ తీవ్ర విషాదం

Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. కారు, ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు.

  • 2021లో మహిళలపై పెరిగిన దాడులు- 50% యూపీలోనే

Crime Against Women: 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగాయి. జాతీయ మహిళా కమీషన్- ఎన్​సీడబ్ల్యూ​ ఈ మేరకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే 30 వేలకుపైగా ఫిర్యాదులు అందగా.. ఉత్తర్​ ప్రదేశ్​ నుంచే సుమారు 15 వేలు ఉన్నట్లు తెలిపింది.

  • 'నాకు ప్రాణభయం ఉంది.. చర్యలు తీసుకోండి'

Karate kalyani complaint : ఆధ్యాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులతో తనకు ప్రాణభయం ఉందని సినీనటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

  • పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు

New year drunk and drive: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మందుబాబులు నానా హంగామా చేశారు. మత్తులో వాళ్లు చేసిన వీరంగాలతో పోలీసులకు చుక్కలు కనిపించాయి.

  • వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST Collection in December 2021: జీఎస్​టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లకుపైనే నమోదయ్యాయి.

  • 'అణు' వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్-పాక్​

India Pakistan Nuclear Exchange: భారత్‌, పాకిస్థాన్​ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. దౌత్య మార్గాల్లో దిల్లీ, ఇస్లామాబాద్​లో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. దీంతోపాటు ఖైదీల వివరాలను కూడా భారత్​, పాక్ పరస్పరం అందజేసుకున్నాయి.

  • వినూత్నంగా 'న్యూ ఇయర్' విషెస్​- ఐస్​క్రీమ్​ పుల్లలతో..

Happy new year 2022: కొత్త ఏడాదికి ఒడిశాకు చెందిన ఓ యువ కళాకారుడు వినూత్నంగా స్వాగతం పలికాడు. ఐస్​క్రీమ్ పుల్లలతో 'హ్యాపీ న్యూ ఇయర్ 'అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. పూరీ జిల్లా కుముటి పట్నా ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ నాయక్ ఈ కళారూపాన్ని తీర్చిదిద్డాడు. ఇందుకోసం అతడు 275 ఐస్​క్రీమ్ పుల్లలను ఉపయోగించాడు.

  • 'రుతురాజ్​ ఓ సంచలనం.. కానీ'

Ruturaj Gaikwad News: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు ఎంపికైన ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ ఓ సంచలమని ప్రశంసించాడు మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా. అయితే అతడికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

  • కొడుకుపైనా దయ చూపని బ్రెట్‌లీ.. క్లీన్​బౌల్డ్ చేసి!

Brett Lee News: మేటి బ్యాటర్లపై ఫాస్ట్​ బాల్స్​తో విరుచుకుపడిన మాజీ స్టార్​ బౌలర్ బ్రెట్​లీ. ఆటకు దశాబ్దం కిందటే వీడ్కోలు పలికిన అతడు మరోసారి బంతి చేతబట్టాడు. ఈ సారి నిర్దయగా తన కుమారుడిని క్లీన్​బౌల్డ్​ చేశాడు.

  • ''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'

RRR movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ సీక్వెన్స్​ గురించి రాజమౌళి అదిరిపోయే రేంజ్​లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేస్తారని ఆయన అన్నారు. ఇంతకీ ఆ సీక్వెన్స్ ఏమై ఉంటుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.