ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7AM - TELANGANA TOP NEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jun 19, 2022, 6:59 AM IST

  • జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు

జాతీయపార్టీ ఏర్పాటుపై గులాబీ దళపతి కేసీఆర్​ కసరత్తు కొనసాగుతోంది. ముందుగా భాజపా వైఫల్యాలు... మతపరమైన రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేలా... వ్యూహరచన జరుగుతోంది. యువత, రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తెరాస అనే పేరు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నందున.. అవే ఆంగ్ల అక్షరాలతో వచ్చేలా జాతీయ పార్టీ పేరు పెట్టాలని కార్యకర్తల నుంచి భారీగా సూచనలు వస్తున్నాయి.

  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనే ఎందుకు లక్ష్యం?

అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్​లో చేసిన ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో డిఫెన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉందని భావించిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేసి పలు కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.

  • బాసర క్యాంపస్​లో సవాలక్ష సమస్యలు

కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా.. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ, బాసర) కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు. ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది.

  • భాజపాకు వణుకు

కేసీఆర్​ జాతీయ రాజకీయాలతో భాజపాకు వణుకుపుడుతుందని తెరాస ఎంపీలు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో మోదీని మించిన అనుభవమున్న నేత కేసీఆర్‌ అని.. దేశంలో మార్పు కోసం ఆయన భుజం కలిపి నడుస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన అభిమాన నేతలకు.. తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

  • నిరుద్యోగులకు మరో శుభవార్త

NPDCL Notification: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని ఎన్పీడీసిఎల్​ పరిధిలో అసిస్టెంట్​ ఇంజినీర్​ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ జారీ చేశారు.

  • ఆరని నిరసనాగ్ని..

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పలు రాష్ట్రాల్లో సైనిక ఉద్యోగార్థులు విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. కొత్త సైనిక నియామక విధానాన్ని రద్దు చేయాల్సిందేనని నినదించారు.

  • 3, 4 ఏళ్లు ధరలు పైకే

Jim Rogers on Inflation: ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పెట్టుబడిదార్లకు బంగారం, వెండి వంటి కమొడిటీలే భద్రమైనవని సింగపూర్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్‌ రోగర్స్‌ అంటున్నారు. 'ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచీ చాలా వరకు కమొడిటీల ధరలు పెరిగాయి.

  • గన్​తో బెదిరించి రూ.50 లక్షలు చోరీ

గుజరాత్​లో భారీ చోరీ జరిగింది. దుకాణంలోకి చొరబడి రూ.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • పసిడి పట్టేసిన నీరజ్ చోప్రా

భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచవేదికపై మెరిశాడు. ఫిన్లాండ్​లో జరుగుతున్న కోర్తానే గేమ్స్​లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు.

  • క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి

Sai pallavi: తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. నటి సాయిపల్లవి ఓ వీడియో విడుదల చేసింది. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.