ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEWS
TELANGANA TOP TEN NEWS
author img

By

Published : Feb 3, 2022, 6:58 PM IST

  • సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​..

CM KCR in Muchital: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిన్న(ఫిబ్రవరి 2) ప్రారంభమైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. చిన జీయర్​ స్వామితో కలిసి దివ్యక్షేత్రమంతా కలియ తిరుగుతూ.. ఏర్పాట్లను, క్రతువులను పర్యవేక్షించారు.

  • మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు..

MEDARAM Special Busses : మేడారం సమ్మక్క సారలమ్మను ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ దర్శించుకున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • కాంగ్రెస్​ నేతల 48 గంటల దీక్ష..

congress diksha on kcr comments: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ దీక్ష చేపట్టింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు 48గంటలపాటు దీక్షలో కూర్చుండనున్నారు.

  • ద.మ రైల్వేకు నిధుల కేటాయింపులు ఇవే..

Railway Budget 2022- 23 under SCR: 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్​లో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన కేటాయింపుల వివరాలను జీఎం సంజీవ్ కిషోర్​ వెల్లడించారు. బడ్జెట్​లో తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ.3,048 కోట్లు కేటాయించారు.

  • వారికి మద్దతుగా బాలయ్య దీక్ష..

Balakrishna Deeksha: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రేపు మౌనదీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • అసదుద్దీన్​ కారుపై కాల్పులు..

Attack on Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ వెళ్తుండగా.. ఓ టోల్​గేట్​ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. 3-4 తూటాలు దూసుకెళ్లాయని చెప్పారు.

  • ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా..

Corona Cases In India: దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేరళ, మిజోరాంలో మాత్రం వైరస్ ప్రభావం ఇంకా పెరుగుతోందని స్పష్టం చేసింది.

  • పాక్​ సైనిక స్థావరాలపై ఉగ్రదాడి..

Terror Attack on Pak Army Post: బలూచిస్థాన్​లో పాక్ సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు జరపగా.. సైన్యం ప్రతిఘటించింది. ఈ ఘటనలో 15 మంది ఉగ్రవాదులు, నలుగురు సైనికులు మరణించారు.

  • భారత్​-శ్రీలంక పింక్​ బాల్​ టెస్టు త్వరలో..

Pink Ball Test: భారత్-​ శ్రీలంక మధ్య బెంగళూరు వెదికగా త్వరలోనే పింక్​ బాల్​ టెస్టు జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. శ్రీలంకతో సిరీస్​పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

  • కేతికతో వైష్ణవ్​ మెలోడీ సాంగ్..

ఈ సినిమాలో వైష్ణవ్​, డాక్టర్​గా కనిపించనున్నట్లు పాట చూస్తే అర్థమవుతోంది. అతడి సరసన కేతికశర్మ హీరోయిన్​గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, గిరీశయ్య దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.