ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Mar 11, 2021, 8:59 AM IST

  • తెలంగాణలో వైభవంగా శివరాత్రి..

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శైవ ఆలయాలన్నీ శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునే పెద్దఎత్తున తరలివస్తోన్న భక్తులు పరమేశ్వరుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు మొక్కులు చెల్లిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమ్మ భాషలో ఇంజినీరింగ్

ఇకపై మాతృభాషలోనే సాంకేతిక విద్య నేర్చుకునేందుకు మార్గం సుగమమైంది. భారతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించాలన్న నూతన జాతీయ విద్యావిధానం-2020 కేంద్రం రూపొందించింది. అందుకు అనుగుణంగా సంప్రదాయ కోర్సులకే పరిమితం చేస్తూ వచ్చే ఏడాది తరగతులకు అనుమతులివ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మామను హత్య చేసిన అల్లుడు

బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు. రోజుకో ఏదో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తవ్వేకొద్ది కేసులు బయటకు వస్తున్నాయి. డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుగొల్పుతున్నాయి. బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి మామను అల్లుడే హత్య చేసిన ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కార్పియో పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కన్నతల్లి చెంతకు గీత

పాకిస్థాన్​ నుంచి భారత్​కు చేరుకుని.. కన్నవారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగురాలు గీత కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో తన తల్లిని ఆమె కలుసుకుంది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గీత తల్లిదండ్రుల జాడ తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • లోయలో పడ్డ బస్సు

ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జావా ద్వీపంలో ఓ యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 35మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సైనిక తిరుగుబాటుపై భారత్ ఆందోళన

మయన్మార్​లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. కాగా, మయన్మార్ సైనిక నిర్బంధంలో మరో రాజకీయ నేత మరణించారు. తీవ్రంగా హింసించడమే మరణానికి కారణమని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చమురు మంట.. ఆరేదెట్టా?

ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉత్పత్తిపై ఇటీవల భారత్ చేసిన​ అభ్యర్థనను ఒపెక్​ దేశాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చమురు దిగుమతిపై కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది. ఇరాన్​ నుంచి మళ్లీ చమురు దిగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్​

థామస్​ బాక్​ మరోసారి అంతర్జాతీయ ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2025 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు బాక్. తాజాగా జరిగిన ఎన్నికల్లో 93-1 తేడాతో అతడు గెలుపొందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అనిరుధ్ ఔట్

తమిళ స్టార్ హీరో చియాన్​ విక్రమ్​, ఆయన తనయుడు ధృవ్​ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా నుంచి సంగీత దర్శకుడు అనిరుధ్​ తప్పుకొన్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి మరో మ్యూజిక్​ డైరెక్టర్​ సంతోష్​ నరాయణ్​ను స్వరాలు సమకూర్చనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.