ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Feb 8, 2021, 12:57 PM IST

170 కాదు.. 203 మంది గల్లంతు

ఆకస్మిక వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​.. 11 మంది మృతులు సహా 203 మంది గల్లంతైనట్లు తెలిపారు. మరో టన్నెల్​లో 35మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆదివారం వరకు తపోవన్​ ప్రాజెక్టుపై అవగాహన లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎంఎస్​పీ ఉంది

కనీస మద్దతు ధరకు ఎలాంటి ఢోకా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ వేదికగా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చొరబాటుదారుడు హతం

జమ్ములోని భారత్​-పాక్​ సరిహద్దులో ఓ చొరబాటుదారుణ్ని సరిహద్దు బలగాలు కాల్చి చంపాయి. సాంబా సెక్టార్​లోని చాక్​ ఫకీరా సరిహద్దు పోస్టు వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సరిహద్దుకే పరిమితం

పాకిస్థాన్​ క్రూరమైన చర్యలను భారత్​ బలగాలు దీటుగా తిప్పుకొడుతున్నాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. భారత బలగాలు పాక్​ చర్యలను సరిహద్దుకే పరిమితం చేశాయన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు రాజ్​నాథ్​ సింగ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజ్‌భవన్ అన్నం

రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో 'రాజ్‌భవన్ అన్నం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. రాజ్‌భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్న గవర్నర్... విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులను పేరుపేరునా పలకరించి నిత్యం అల్పాహారం తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు..

గిరిజనుల భూములు రక్షించేందుకు భాజపా ప్రయత్నిస్తుంటే.... కేసీఆర్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గుర్రంబోడు ఘటనపై స్పందించిన సంజయ్.. పోలీసులకు తమకు మధ్య ఎలాంటి గొడవ లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఉపసర్పంచ్ దంపతులు మృతి

ఖమ్మం జిల్లాలో రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ఉపసర్పంచ్ దంపతులు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ట్రంప్​కు అండగా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను రిపబ్లికన్ సెనేటర్లు వెనకేసుకొచ్చారు. వాషింగ్టన్ క్యాపిటల్ దాడికి ఆయన బాధ్యుడ్ని చేయడాన్ని తప్పుబట్టారు. ప్రసంగాలపై నేరపూరిత ముద్ర వేయాలనుకుంటే అందరిపైనా అభిశంసన చేపట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ క్రికెట్ జట్టుపై​ డాక్యుమెంటరీ

2020లో టీ20 మహిళల ప్రపంచకప్​ గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుపై ఓ డాక్యుమెంట్​ తయారైంది. దీన్ని 'ది రికార్డ్' పేరుతో అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల చేసింది క్రికెట్​ ఆస్ట్రేలియా. ఇందుకు సంబంధించిన ట్రైలర్​ను తాజాగా ఆవిష్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

క్యాన్సర్​ను అలా జయించా..

క్యాన్సర్​ను జయించడంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.