- హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అది మా విజయమే
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. భారత్ పర్యటన వాయిదా వేసుకోవడం తాము సాధించిన రాజకీయ విజయంగా పేర్కొన్నాయి కర్షక సంఘాలు. దీనిని మోదీ సర్కారుకు దౌత్యపరమైన ఓటమిగా అభివర్ణించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భగ్గుమన్న 'పెట్రోల్'
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి.. రూ. 84.20కు చేరింది. ఫలితంగా దేశంలో పెట్రల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాయి. మరోవైపు ముంబయిలో లీటర్ డీజిల్ ధర రికార్డు స్థాయిలో 81.07కు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భాజపా సన్నాహక సమావేశం
త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు భాజపా కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పోలీసుల అదుపులోకి వీర్రాజు, జీవీఎల్ ..
చలో రామతీర్థానికి మరోసారి భాజపా-జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం రామతీర్థ ధర్మయాత్రతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పోలీసులు భారీగా బందోబస్తు మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చిరుత సంచారం వీడియో వైరల్
కర్ణాటకలోని చామరాజనగర్ శివార్లలో ఉన్న మెడికల్ కాలేజీలోకి చిరుతపులి ప్రవేశించింది. డాక్టర్స్ లాడ్జ్‌లో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆవి చూసిన డాక్టర్లు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సినీ ఫక్కీలో భర్త హత్య..
జీవితాంతం కలిసి ఉందామని పెళ్లాడింది. ముద్దుగా ముగ్గురు పిల్లలు. సాఫీగా సాగుతున్న సంసారంలో భార్య వివాహేతర సంబంధం... భర్తను కడతేర్చే వరకు వెళ్లింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉపాధ్యక్షుడు పెన్స్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా ఉపాధ్యక్షుడు, సెనేట్ సభాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడంలో బాధ్యతగా మెలగలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్..
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. కోల్‌కతా వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని చెప్పాడు. ఈ సందర్భంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నటుడు సోనూసూద్‌పై పోలీస్ కేసు
నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారనే కారణంతో నటుడు సోనూసూద్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ ఈయన బిజీగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి