ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEW
TELANGANA TOP TEN NEW
author img

By

Published : Feb 17, 2022, 9:04 PM IST

  • ఘనంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..

KCR Birthday Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. 68వ జన్మదిన వేడుకలు హోరెత్తించాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు. అభిమాన నేతకు ఘనంగా... పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

  • నాడు ఉద్యమనేతగా.. నేడు అభివృద్ధి ప్రదాతగా..

Minister KTR Programme: మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకల్లో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. పూడుర్ గ్రామంలో ఫుడ్​ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్​ భూమి పూజ చేశారు. అనంతరం బహదూర్​పల్లిలో నిర్వహించిన కేసీఆర్​ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

  • ఫిబ్రవరి 17 ఇక నుంచి నిరుద్యోగ దినం..

February 17th Unemployment Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. లక్షలాది ఖాళీలున్నాయన్న ఆయన... సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • జనమయమైన జంపన్న వాగు..

Medaram Jathara 2022: మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే క్రమంలో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో ఇసకేస్తే రాలనంతగా జంపన్న వాగు భక్తులతో కిక్కిరిసిపోయింది.

  • రైతులకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​ది..

Election 2022: రైతులను నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​దని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భక్తి నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం పంజాబ్​కు ఇప్పుడు అవసరమని అన్నారు.

  • మీ తప్పులకు నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?

Manmohan Singh criticizes Modi: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భాజపా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు నెహ్రూనే బాధ్యులను చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

  • కొవిడ్​ మరణాలపై దుష్ప్రచారం..

covid deaths in india: కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవం, పూర్తిగా అస్పష్టం అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మరణాలను లెక్కించేందుకు దేశంలో పటిష్ఠమైన వ్యవస్ధ అందుబాటులో ఉందని తెలిపింది.

  • ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కాల్పులు..

Russia Ukraine conflict: రష్యా, ఉక్రెయిన్​ ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. తూర్పు ఉక్రెయిన్​లోని కాడివ్కాలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ నేపథ్యంలో.. రష్యావి రెచ్చగొట్టే చర్యలే అని అమెరికా ఆరోపించింది.

  • ప్రపంచకప్​లో ఈ ఎమ్మెల్యే గురి తప్పదు..

ఎమ్మెల్యేగా ఓవైపు ప్రజలకు సేవచేస్తూనే మరోవైపు ట్రాప్​ షూటర్​గానూ రాణిస్తున్నారు బిహార్​ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్​. గతేడాది డిసెంబరులో పటియాలా వేదికగా జరిగిన జాతీయ షూటింగ్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించిన శ్రేయసి.. త్వరలో ప్రారంభం కానున్న మహిళల ట్రాప్​ షూటింగ్ ప్రపంచకప్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి మరిన్ని వివరాలు..

  • కొత్త సినిమా ముచ్చట్లు వచ్చేశాయి..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గాడ్​ఫాదర్, దృశ్యం 2 హిందీ, పృథ్వీరాజ్, ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, చోర్ బజార్, బచ్చన్ పాండే, ఈటీ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.