ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEW
TELANGANA TOP TEN NEW
author img

By

Published : Feb 16, 2022, 9:00 PM IST

  • ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర..

Medaram Jatara 2022: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర వైభవంగా ప్రారంభమైంది. మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుంటున్నారు.

  • సీఎం కేసీఆర్​కు ఉద్దవ్ ఠాక్రే మద్దతు..

CM KCR Mumbai Tour: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే... సీఎం కేసీఆర్​కు ఫోన్‌చేసి ముంబయికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్‌ ముంబయి వెళ్లనున్నారు.

  • మోదీకి మరో అవకాశమిస్తే అంతే..

KTR Comments on Modi : నరేంద్ర మోదీకి ప్రధానిగా మరో అవకాశమిస్తే.. తెలంగాణను ఆంధ్రాను కలుపుతారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం ధర్మం అని చెప్పే భాజపా సర్కార్.. దేశానికి ఏం చేస్తుందో మాత్రం చెప్పదని వ్యాఖ్యానించారు. మోదీ కేవలం ఉత్తర్​ప్రదేశ్, ఉత్తర భారత్​కు మాత్రమే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

  • రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు..

EC notice to Raja Singh: యూపీ ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్​కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

  • రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

COVID-19 restrictions: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున కేంద్రం కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. కొవిడ్​ పరిస్థితులను సమీక్షించి ఆంక్షలను ఎత్తివేయాలని లేదా సడలించాలని నిర్దేశించింది.

  • కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ ఉక్రెయిన్'..

Indian Embassy In Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్​లైన్స్​తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.

  • 19% తగ్గిన కరోనా కేసులు...

WHO New COVID cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంతో పోలిస్తే.. కేసులు 19 శాతం పడిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొంది. మరణాల సంఖ్య స్థిరంగా ఉందని వెల్లడించింది.

  • 30 రోజుల్లో కురవాల్సిన వర్షం మూడు గంటల్లోనే..

Brazil flood 2022: బ్రెజిల్​ రియో డి జెనిరో రాష్ట్రం పెట్రొపొలిస్​ నగరాన్ని వరద ముంచెత్తిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. మరెంతో మంది ఆచూకీ గల్లంతు కాగా.. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

  • ఐపీఎల్‌ వేలంలో తప్పిదం..

IPL 2022 Auction: ఐపీఎల్​ వేలం ప్రక్రియలో ఓ తప్పిదం జరిగినట్లు తాజాగా సోషల్‌మీడియాలో బయటికొచ్చింది. ఆక్షనీర్‌ పొరబాటు కారణంగా ముంబయి ఇండియన్స్‌కు దక్కాల్సిన పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను దిల్లీ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

  • బీమ్లానాయక్​ సందడి షూరూ..

Bheemla nayak trailer: 'భీమ్లా నాయక్' టీమ్.. రాబోయే పదిరోజులు ప్రచారంతో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్​కు తేదీలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.