ETV Bharat / city

Telangana Top News టాప్‌ న్యూస్ 7PM - Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Sep 2, 2022, 6:59 PM IST

  • రాష్ట్రంపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంపై వివక్షతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటులో హైదరాబాద్‌ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమన్నారు.

  • ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ భేటీ నిర్ణయించనుంది.

  • మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

సికింద్రాబాద్​లోని బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

  • తీస్తా సెతల్వాద్​కు మధ్యంతర బెయిల్..

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్​పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. సాధారణ బెయిల్ పిటిషన్​పై నిర్ణయం గుజరాత్ హైకోర్టుదేనని స్పష్టం చేసింది.

  • బర్త్​డే పార్టీకి వచ్చి గొడవ..

పిలవని పార్టీకి వచ్చిన కొంతమంది వ్యక్తులు.. గొడవకు దిగి ఒకరిని హత్య చేశారు. భవనం నుంచి తోసేసి ఓ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

  • 'ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన లక్ష్యం'

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన కర్తవ్యమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ధరల పెరుగుదల, జీడీపీ వృద్ధిపై ప్రపంచ పరిణామాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. భారత్‌ వద్ద పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.

  • టీమ్​ఇండియాకు షాక్.. స్టార్ ఆల్​రౌండర్​కు గాయం..

ఆసియా కప్​లో దూసుకెళ్తున్న భారత క్రికెట్​ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయం కావడం వల్ల ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది.

  • మ్యాచ్​లో గాయపడ్డ నాదల్..

టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్ గాయపడ్డాడు. యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినితో రఫేల్ తలపడిన సమయంలో చోటు చేసుకుంది.

  • మోహన్​బాబుతో గొడవ.. మరోసారి ఏడుస్తూ మాట్లాడిన బెనర్జీ

గతేడాది జరిగిన 'మా' ఎన్నికల్లో అనేక మలుపులు చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఆయనకు నటుడు మోహన్​బాబుకు మధ్య జరిగిన గొడవపై తాజాగా మాట్లాడారు సీనియర్​ నటుడు బెనర్జీ.

  • వాట్సాప్​లో ఈ ట్రిక్స్ అన్నీ​ మీకు తెలుసా? ఇప్పుడు మరింత మెరుగ్గా..

ఆధునిక కాలంలో వాట్సాప్​ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సపోర్ట్​ చేసే ఫ్రీ మెసేజింగ్​ యాప్​. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్​ వచ్చినప్పటికి దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. వాట్సాప్​ను ఇంకా మెరుగ్గా ఉపయోగించేందుకు ఈ 5 ట్రిక్స్ మీ కోసం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.