ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 5PM - 5PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Aug 23, 2022, 4:59 PM IST

  • రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది.

  • పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ ఈ తాఖీదులు ఇచ్చారు.

  • ప్రజాసంగ్రామ యాత్ర పక్కాగా చేస్తాం, ఎవరూ ఆపలేరన్న బండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న బండి, ఈ యాత్రను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. పక్కాగా చేస్తాం ఎవరు ఆపుతారో చూస్తామని వెల్లడించారు.

  • కేసీఆర్​లో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందన్న కిషన్​ రెడ్డి

అధికారం చేజారిపోతుందనే అభద్రతాభావం ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్​ అహంకారానికి ఇప్పటికే హుజూరాబాద్​ ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

  • రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు అసహనం, ఆ గ్యారంటీ ఉందా అని సీజేఐ ప్రశ్న

ఆధునిక వైద్యాన్ని విమర్శిస్తూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. యోగాకు ఆయన ప్రాచుర్యం కల్పించారని.. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించడం సరికాదని జస్టిస్ ఎన్​వీ రమణ అన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

  • నిద్రిస్తున్న భార్యను లేపి, రైలు కిందకు తోసి హత్య

ప్లాట్​ఫాంపై నిద్రిస్తున్న తన భార్యను నిద్ర లేపి అతి కిరాతకంగా పట్టాలపైకి తోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో జరిగింది. వాసాయ్​ రైల్వేస్టేషన్​లో సోమవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి నిద్రిస్తున్న తన భార్యను లేపి, అప్పుడే వస్తున్న ఎక్స్​ప్రెస్​ మెయిల్​ ట్రైన్​ కిందకు హఠాత్తుగా తోశాడు.

  • ఠాక్రే వర్సెస్ శిందే, విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

శివసేన పార్టీ ఇరువర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నందున దీనిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆగస్టు 25న వీటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

  • యూఎస్​ ఓపెన్​కు సానియా దూరం

స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ యూఎస్​ ఓపెన్​ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే తన రిటైర్మెంట్​ ప్లాన్​ను మార్చుకున్నట్లు తెలిపింది.

  • ఆ ఆరు నెలలు నరకం, నొప్పిని భరిస్తూనే ఆట

స్టార్ షట్లర్​ పీవీ సింధు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. తాను ఎదుర్కొన్న టఫెస్ట్​​ ప్లేయర్​, ఆమె తనను ఎలా రెచ్చగొట్టిందో వివరించింది.

  • అవన్నీ తెలుసుకున్నాకే సూచీ ఫండ్లలో పెట్టుబడులు, ప్రయోజనాలు ఇవే

స్టాక్​ మార్కెట్లలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అయితే మార్కెట్​ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో పెట్టుబడులు పెడితే నిర్వహణలోనూ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్​ సంస్థలు ఈ సూచీ ఫండ్లను తీసుకొస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.