ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 5PM - టాప్ న్యూస్ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Aug 20, 2022, 4:59 PM IST

  • తాను బతికున్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టనన్న కేసీఆర్​

మునుగోడు వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ కాదు బోడీని తెచ్చినా భయపడమంటూ తేల్చిచెప్పారు. భాజపాకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లకు బిగించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహిస్తున్న ప్రజాదీవెన సభకు వెళ్తున్నారు. 400 కార్లు ర్యాలీగా బయలుదేరగా సీఎం కాన్వాయ్ హబ్సీగూడ నుంచి మునుగోడు వెళ్తోంది. తెరాస శ్రేణుల కోలాహలంతో నగర రహదారులన్నీ సందడిగా మారాయి.

  • 'అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పనిచేస్తాం'

మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మునుగోడుతో పాటు అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై తమ పోరాటం ఆగదని చాడ స్పష్టం చేశారు.

  • చుట్టు చుట్టు చుక్కలు చూడు, మల్లారెడ్డి డ్యాన్స్​ చూడు

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌లతో పార్టీ కార్యకర్తలలో జోష్‌ నింపారు. చుట్టు చుట్టు చుక్కలు చూడు... అంటూ పాటకు ఒకవైపు కార్యకర్తలు నృత్యాలు చేస్తుంటే మరోవైపు వాహనంపైనే మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరిచారు.

  • భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని రేవంత్​రెడ్డి ఫైర్

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. రాజీనామా చేస్తే నిధులొస్తాయంటున్న భాజపా... వారి ఎంపీలను ఎందుకు రాజీనామా చేయించట్లేదని రేవంత్‌ ప్రశ్నించారు.

  • గిరిజన మహిళపై ఆబ్కారీ అధికారుల దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

సోదాల పేరుతో ఇంట్లో చొరబడి గిరిజన యువతిపై ఆబ్కారీ శాఖ అధికారులు దాడి చేశారు. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో ఈ ఘటన జరిగింది. ఆబ్కారీ పోలీసులు చేసిన ఈ దాడి విషయంలో ఆబ్కారీ సీఐ హరితో పాటు ఎస్సై మరికొంత మంది సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

  • కాలేజీ బస్సు, కంటైనర్ ఢీ, ఇద్దరు మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు

కాలేజీ బస్సు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు ఆడుతూ పాడుతూ గడిపిన విద్యార్థులు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

  • ఆ దేశ ప్రధానికి డ్రగ్స్​ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు.

  • కోహ్లీ సెంచరీకి వెయ్యి రోజులు, ఆసియాకప్‌లోనైనా అందుకుంటాడా

దాదాపు 1000 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్​లో విరాట్ కోహ్లీ ఒక్క శతకం కూడా బాదలేదు. చివరి సారిగా 2019లో సెంచరీ చేశాడు. అతడు ఫామ్​ కోల్పోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో భారత్​-పాకిస్థాన్ మధ్య ఆగస్టు 22న జరగబోయే ఆసియా కప్ మ్యాచ్​లో​ కోహ్లీ ఆడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

  • సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ..

ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సంగతులివీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.