ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 9PM - top news in at 9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news
Telangana Top news
author img

By

Published : Aug 16, 2022, 8:58 PM IST

  • దుష్ట శక్తులకు బుద్ధి చెబితేనే దేశం బాగుంటుందన్న కేసీఆర్‌

CM KCR on BJP తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి చేసిందా అని ప్రశ్నించారు. వికారాబాద్​ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం​ ప్రారంభించిన సీఎం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు.

  • మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం

Mass singing of national anthem స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం పదకొండున్నర గంటలకు ఎక్కడి వారు అక్కడే నిల్చొని.. జాతీయ గీతం ఆలపించారు. ప్రజలందరూ జనగణమన పాడి.. దేశభక్తిని మరోసారి చాటారు.

  • ఎన్నికలొచ్చినా భాజపాదే గెలుపు

Kishan Reddy Comments on KCR సీఎం కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీపై ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • ప్రధాని వ్యాఖ్యలను తెరాస వక్రీకరిస్తోందని బండి ఆగ్రహం

Bandi Sanjay Comments జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పోలీసులను పెట్టి పాదయాత్రకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందు విస్నూర్​లో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో సంజయ్​ పాల్గొన్నారు.

  • చైనాకు ఇక చెక్

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. పాంగాంగ్‌ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అందజేశారు.

  • రూ.2వేల కోట్ల మత్తుపదార్థాలు సీజ్

గుజరాత్​లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ ప్రాంతంలో 513 కేజీల డ్రగ్స్​ను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళతో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, వడోదరాలో మరో రూ.వెయ్యి కోట్ల మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి.

  • ఎనిమిది మంది జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాల వాహనం నదిలో పడిపోగా ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు. 30 మంది సైనికులు గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదు

తలాక్ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలకు ఒకసారి చొప్పున వరుసగా మూడు నెలలు చెప్పే తలాక్- ఈ- హసన్​.. ముమ్మారు తలాక్ వేర్వేరు అని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు ఖులా ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది.

  • ఆ విషయంలో దిల్​రాజు వివరణ

కార్తికేయ-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై నిర్మాత దిల్​రాజు వివరణ ఇచ్చారు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని అన్నారు. అవాస్తవాలు రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయండి అని చెప్పుకొచ్చారు.

  • అతనికి ఒక్క ఇన్నింగ్స్ చాలు

టీమ్​ఇండియా బ్యాటర్​ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మద్దతుగా నిలిచారు. వచ్చే ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు బౌలర్​ దీపక్ చాహర్ పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ మణిందర్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాహర్ చాలా టాలెంటెడ్ ఆటగాడని అన్నారు మణిందర్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.