ETV Bharat / city

Telangana News Today టాప్​ న్యూస్​ 5PM

author img

By

Published : Aug 15, 2022, 4:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

  • కృష్ణయ్య హత్య దారుణం, ఎలాంటి చర్యలకు దిగొద్దని తుమ్మల కార్యకర్తలకు సూచన

ఖమ్మంలో తెరాస నేత హత్య ఘటన బాధాకరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కార్యకర్తలు ఆగ్రహంతో ఎలాంటి చర్యలకు దిగొద్దని సూచించారు. హత్యా రాజకీయాలు జరిగితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని గుర్తుచేశారు.

  • డిసెంబర్‌లో మునుగోడు ఉపఎన్నిక, గెలుస్తామని ఉత్తమ్ ధీమా

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ముసలం మొదలైంది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు గెలుపు దిశగా ప్రయత్నాలు, వ్యూహాలు పన్నుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్‌లో మునుగోడు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

  • అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్‌లో మువ్వన్నెల జెండా చూశారా

భారతదేశ వ్యాప్తంగా వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే అమెరికాలోని ప్రముఖ టెస్ట్‌ పైలట్‌, వ్యోమగామి రాజాచారి.. ఓ త్రివర్ణపతాక ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ వ్యాపారి మృతి

గ్రేటర్ హైదరాబాద్ కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మి విల్లాస్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జెండా వందనం అనంతరం ప్రసంగిస్తూ ఓ వ్యాపారి గుండెపోటుతో చనిపోయారు.

  • భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతమైంది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

  • ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థ రావాలని చంద్రబాబు ఆకాంక్ష

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని బాబు అన్నారు.

  • దళిత విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసిన టీచర్​, 18 గంటలు అలానే

11 ఏళ్ల విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు ఓ ఉపాధ్యాయుడు. సుమారు 18 గంటలపాటు బాలుడు టాయిలెట్​లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం వేరే ఉపాధ్యాయులు బాత్​రూమ్​ డోర్​ను తెరవగా బయటకొచ్చాడు బాలుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • స్వతంత్ర భారత్​ విజయాలు భళా అంటూ బైడెన్, పుతిన్​ సందేశాలు

భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని కీర్తించారు జో బైడెన్​. మరోవైపు ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.

  • ఈఎంఐలు ఆల‌స్యంగా చెల్లిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా

రుణాలు తీసుకునేవారు ఈఎంఐ చెల్లించడం అలవాటుగా మార్చుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే మీ క్రెడిట్​ స్కోర్ తగ్గిపోతోంది. దాంతో పాటు జరిమానా వసూళ్లు కూడా ఉంటాయి. అందుకే ఈఎంఐల చెల్లింపులు లేట్ చేస్తే ఏం జ‌రుగుతుందో ఓ సారి తెలుసుకుందాం.

  • ఒక్కసారి ఛార్జింగ్​తో 500కిమీ జర్నీ, ఓలా కార్​ ఫీచర్స్ ఇవే

విద్యుత్ వాహనాల రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది ఓలా. ఒక్కసారి ఛార్జింగ్​తో 500 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఈ-బైక్​లకు అప్డేట్లు, సరికొత్త బ్యాటరీ అభివృద్ధి, ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు వంటి విషయాలపై సంస్థ ప్రణాళికలను వెల్లడించారు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.