ETV Bharat / city

7AM టాప్​న్యూస్

author img

By

Published : Aug 14, 2022, 6:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS

  • ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? ( ఆగస్టు 14 - ఆగస్టు 20)

ఈ వారం ( ఆగస్టు 14 - ఆగస్టు 20) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

  • బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను నిర్ణయించే శక్తిగా భారత్ ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గుజరాత్​లోని గిఫ్ట్ సిటీలో ఇటీవల ప్రారంభించిన ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజీ ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

  • పంద్రాగస్టు ముహూర్తంపై మౌంట్​బాటెన్ చెప్పిన అసలు కారణం ఇదే

భారత స్వాతంత్య్ర ముహూర్తంగా 1947 ఆగస్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు. ఎవరు ఎలా నిర్ణయించారు. దానివెనక సాగిన కసరత్తు ఏంటని చూస్తే నోటికొచ్చిన తేదీని అలవోకగా చెప్పేసి దాన్నే ముహూర్తంగా నిర్ణయించి రెండు నెలల్లో ఆంగ్లేయులు అధికారాన్ని బదిలీ చేసేశారని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

  • గెలుపు గుర్రానికే అవకాశం ఎవరికివారే అభ్యర్థిగా ఊహించుకోవద్దు

మునుగోడు ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరికివారే ఊహించుకొని ఆశలు పెట్టుకోవద్దని ఆశావాహులకు సూచించారు. 'ఏ ఎన్నికలోనైనా ఆశావహులు చాలామంది ఉంటారు. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుంది' అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

  • ఎడతెగని నిరీక్షణ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీ

రైళ్లు ఎక్కేందుకు లక్షల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ శాఖ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటుచేయకుండా ప్రయాణ సమయం వరకు ఊరిస్తూ ఆఖర్లో ఉసూరుమనిపిస్తోంది.

  • కాళ్లు, చేతులు కట్టేసి రూ.30 వేలు అపహరణ

ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అంటున్న జీవితా రాజశేఖర్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న సందర్భంగా జీవిత కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని సినీనటి జీవితా రాజశేఖర్‌ అన్నారు.

  • వచ్చే ఏడాది డిసెంబర్​లోనే అయోధ్య రాముడి దర్శనం

వచ్చే ఏడాది డిసెంబర్​లోగా అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి.

  • వరల్డ్‌ ఛాంపియన్‌షిప్​కు పీవీ సింధు దూరం

ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్​ స్టార్​ బ్యాడ్మింటన్ ప్లేయర్​ పీవీ సింధు దూరమైంది. గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

  • చైనా నిఘా నౌకకు శ్రీలంక గ్రీన్​సిగ్నల్

చైనా పరిశోధక నౌక యువాన్‌ వాంగ్‌కు అనుమతిస్తూ శ్రీలంక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భారత్‌ తీవ్ర అభ్యంతరాలు తెలిపినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ అనుమతులు జారీ చేసింది లంక.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.