ETV Bharat / city

7పీఎం తెలంగాణ టాప్​న్యూస్

author img

By

Published : Aug 12, 2022, 6:59 PM IST

Updated : Aug 12, 2022, 7:56 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

  • పెరుగుతున్న కొవిడ్ కేసులు..

భారత్​లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ నియమాలను పాటించాలని ప్రజలను కోరింది.

  • కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు లేఖలు

గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

  • ప్రగతిభవన్​లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ప్రగతిభవన్​లో రక్షాబంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి. పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్​కు తన సోదరీమణులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కుమారుడు, కుమార్తెలయిన కేటీఆర్, కవితతో పాటు​ మనువడు మనువరాలు కూడా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.

  • రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీలో ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో మొదలైన కాక ఇప్పుడు ఆయన సోదరుడు వెంకట్​రెడ్డికి తగులుతోంది. తమ్ముడి బాటలోనే అన్న కూడా నడుస్తాడేమోనన్న అనుమానమో పార్టీలోని కీలక వ్యక్తులకు ముందు నుంచి పడకపోవటమో ఆయనను పక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది.

  • డ్రగ్స్​తో దొరికిపోయిన నైజీరియన్

హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయిస్తూ మరో నైజీరియన్​ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీసాపై వచ్చి గడువు తీరినా నిందితుడు హైదరాబాద్​లో ఉంటూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

  • ఫ్రీ విమాన టికెట్ అంటూ ఎర.. లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్​లైన్స్ పేరిట ఓ లింక్‌ వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్‌ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

  • వావివరసలు మరిచి చెల్లెలిపై సోదరులు రేప్.. ​

మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచిన కామాంధులు.. సొంతవారినీ వదలడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే బిహార్​లో జరిగింది.

  • 'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'

దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు తాను ప్రయత్నిస్తామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్​ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

  • 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష..

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది.

  • ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్​ఇండియా మరోవైపు.. క్రికెట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్​ రెస్ట్ ఆఫ్​ ది వరల్డ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్​ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్​కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా ఈ మ్యాచ్​ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

Last Updated : Aug 12, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.