ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - టాప్​న్యూస్ 5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Aug 6, 2022, 4:58 PM IST

  • 'కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..'

దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. చాలా బాధాకరమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు.

  • 'ఇది ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది'

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన బండి... వారితో భేటీ అయ్యారు.

  • 'నేతన్నలకు నోటి మాటలు కాదు.. నిధుల మూటలు ఇచ్చి చేయూతనివ్వండి'

రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత రంగానికి కేంద్రం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

  • 'కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా..?'

కాంగ్రెస్‌ పార్టీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా అని ఆయన ప్రశ్నించారు. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్​రెడ్డి చండూరు సభలో తనపై చేసిన విమర్శలు బాధ కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

  • కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యల పట్ల సీనియర్ల అసహనం..

రాష్ట్ర కాంగ్రెస్​లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు.. కొంత మంది నాయకులు పార్టీ వీడుతుంటే.. మరికొంత మంది వారిపై ఘాటు కామెంట్లు చేయటం ఇప్పుడు కాంగ్రెస్​లో కాక రేపుతోంది. ఇప్పుడు తాజాగా.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిపై అద్దంకి దయాకర్​ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలోని సీనియర్లు తప్పుబడుతున్నారు.

  • పార్లర్​లో యువతిపై గ్యాంగ్​రేప్​.. మేనేజర్​, కస్టమర్ కలిసి..

బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్న ఓ యువతిపై పార్లర్​ మేనేజర్​తో పాటు కస్టమర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పడేసి పారిపోయారు.

  • ఎన్నికల్లో గెలిచింది భార్యలు.. ప్రమాణస్వీకారం చేసిందేమో భర్తలు!

సాధారణంగా గ్రామాల్లో పంచాయతీ సభ్యులుగా మహిళలు గెలిస్తే వారి స్థానంలో భర్తలు విధులు నిర్వహించడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి తరచూ చూస్తేనే ఉంటాం. కానీ, ఈ పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలిచినా.. వారి భర్తలు లేదా తండ్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

  • పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్​ దియరా ఘాట్​ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. సోన్​ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్​ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

  • బంగ్లా టైగర్స్‌పై విరుచుకుపడుతున్న జింబాబ్వే..

జింబాబ్వే పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్​కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన బంగ్లా.. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను సైతం ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర రికార్డులను తెలుసుకుందాం..

  • పవన్​పై నిర్మాత బండ్లగణేశ్ ట్వీట్​.. అలా చేయాలంటూ..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేశ్‌ చిన్న విన్నపం చేశారు. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసే చిత్రాలతో పవన్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ 'గబ్బర్‌సింగ్‌' లొకేషన్‌లో దిగిన కొన్ని ఫొటోలను శనివారం గణేశ్‌ షేర్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.