ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @7PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 4, 2022, 6:58 PM IST

  • 'ఆ బర్త్​డే పార్టీ మనకు వార్నింగ్​ బెల్.. గెలుపు కష్టమే'..

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సిద్ధరామయ్య 75వ బర్త్​డే పార్టీ వేదికగా కాంగ్రెస్​ ఐక్యతారాగం ఆలపించగా.. భాజపా అప్రమత్తమైంది. ఇదే విషయంపై తన అభిప్రాయాల్ని అగ్రనేత అమిత్​ షాకు మాజీ సీఎం యడియూరప్ప నిర్మొహమాటంగా చెప్పారని తెలిసింది.

  • భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి: సీఎం కేసీఆర్

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్​రెడ్డి అని తెలిపారు. భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి అని తెలిపారు.

  • మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్​ ఎన్టీఆర్​

మూడు రోజుల క్రితం మరణించిన తన మేనత్త ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్​ ఎన్టీఆర్​ పరామర్శించారు. సతీసమేతంగా వెళ్లి.. మేనత్త కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

  • తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే?

కరీంనగర్ జిల్లాలో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజురాబాద్​ నియోజకవర్గం అభివృద్దిపై చర్చకు రావాలని తెరాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఈటలకు సవాల్ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

  • 'కమిటీలు వేసి చేతులు దులుపుకోవటం కాదు.. ఆ పని చేయండి..'

ఏపీలోని అచ్యుతాపురం సెజ్​ పరిశ్రమ ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ మొదలుకుని.. పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైపోయిందని ఆరోపించారు.

  • 'అచ్యుతాపురం ఘటనకు కారణం ముమ్మాటికి వాళ్ల నిర్లిప్తతే..'

ఏపీలోని అచ్యుతాపురం సెజ్‌లో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఎప్పుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందోనని.. ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనని భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

  • బోల్తా పడిన రైలు దగ్గర ఫొటో.. ఒకరు మృతి..

జలపాతం వద్ద ఫొటో దిగుతూ ఒకరు గల్లంతైన ఘటన తమిళనాడు దిండిగుల్​లో జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బిహార్​లో జరిగిన మరో ఘటనలో బోల్తా పడిన రైలు బోగీ వద్ద ఫొటో దిగుతున్న ఇద్దరు యువకులకు హైటెన్షన్​ వైర్లు తగిలాయి.

  • చైనా దూకుడు.. తైవాన్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ తైవాన్​ పర్యటనపై చైనా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే తైవాన్​ భూభాగం చుట్టూ సైనిక విన్యాసాలను ప్రారంభించిన చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ.. తైవాన్​ ఈశాన్య, నైరుతి ప్రాంత జలాల్లో డాంగ్​ఫెంగ్​ బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్​ రక్షణశాఖ సైతం ధ్రువీకరించింది.

  • అమెజాన్​లో 'ప్రెషర్ కుక్కర్'​ కొన్నారా? అయితే బీ అలర్ట్​!

ప్రముఖ ఈ-కామర్స్​ వెబ్​సైట్​ అమెజాన్​లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. నాణ్యత సరిగా లేని కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్​కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది.

  • టీమ్​ఇండియా నయా 'స్వింగ్ క్వీన్'..

కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న భారత మహిళల క్రికెట్​ జట్టు బౌలర్​ రేణుకా సింగ్ ఠాకూర్.. తన సూపర్ ఫామ్​తో ఆకట్టుకుంటోంది. హిమాచల్‌ ప్రదేశ్​కు చెందిన ఈ ప్లేయర్ టీమ్​ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌‌గా మారి, వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.