ETV Bharat / city

Telangana Top News: టాప్ న్యూస్@5PM - Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5pm topnews
5pm topnews
author img

By

Published : Jul 6, 2022, 4:58 PM IST

  • త్వరలోనే గ్రూప్‌-4నోటిఫికేషన్‌.. మంత్రి క్లారిటీ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తోంది. ఇప్పుడు త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి..

రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ కంపెనీలు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించింది.

  • 'నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా..'

భాజపాలో చేరిన తర్వాత మొదటిసారిగా కొండా విశ్వేశ్వర్​రెడ్డి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కొండా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

  • పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. విడిపోయిన బోగీలు.. ఆ తర్వాత..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. కానీ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • మైనర్ల డ్రైవింగ్‌.. కారు బీభత్సంలో ముగ్గురికి తీవ్రగాయాలు

ఇద్దరు మైనర్ల అతి వేగం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. రిక్షాలు మరమ్మతు చేస్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

  • విషమంగా లాలూ ఆరోగ్యం.. చికిత్స కోసం సింగపూర్​కు!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రస్తుతం పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. తొలుత దిల్లీకి, మరీ అవసరమైతే సింగపూర్​కు తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

  • 'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'..

ఏక్​నాథ్​ శిందే లాంటి వ్యక్తి తమిళనాడులోనూ పుట్టుకొస్తారని అన్నారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై. మహారాష్ట్ర తరహాలో అక్కడ కూడా అధికార మార్పిడి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని అధికార డీఎంకే తోసిపుచ్చింది.

  • 'మహా'లో మరో 3 రోజులు కుండపోతే..!

మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు ముంబయిని భారీ వానలు అతలాకుతలం చేశాయి. చాల్​ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

  • బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం..

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స‌ర్కార్ రాజ‌కీయ సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో నడిచారు.

  • సామ్​ బాలీవుడ్​ ఎంట్రీ.. ఆ యంగ్​హీరోకు గ్రీన్​సిగ్నల్​!

హీరోయిన్ సమంత మరో హిందీ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. యంగ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానాతో కలిసి ఓ మూవీ చేయనుందట. ఈ ఏడాది చివర్లో ఆ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుందని టాక్​ వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.