ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​@7AM - topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
telangana top news
author img

By

Published : Mar 6, 2022, 7:01 AM IST

  • నేడు కేబినెట్​ భేటీ..

Telangana Cabinet Meeting: బడ్జెట్ ఆమోదం ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం భేటీ కానున్న కేబినెట్.. బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై చర్చించనుంది. దేశంలో ప్రబలమైన మార్పు ధ్యేయంగా వివిధ పార్టీల నేతలతో జరుపుతున్న చర్చలు, వాటి సారాంశాన్ని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది.

  • గవర్నర్​ అసంతృప్తి

Governor Vs Government: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణను స్వయంగా తప్పుపట్టిన గవర్నర్ తమిళిసై... హాస్యాస్పదంగా ఉందంటూ అభివర్ణించారు. రాజ్యాంగపరంగా తనకు అధికారం ఉన్నప్పటికీ... ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

  • 'ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు కుట్ర'

YS Viveka murder case: ఏపీ మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నుంచే పథకరచన జరిగిందని వివరించింది. హత్యలో కీలకపాత్ర ఎర్ర గంగిరెడ్డిదేనని వెల్లడించింది. ఎర్ర గంగిరెడ్డి.. మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు, ఇతర కుట్రదారులతో కలిసి సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

  • కొండెక్కిన విజయ పామాయిల్‌ ధర..

Vijaya Palm Oil Price: ఉక్రెయిన్‌, రష్యాల యుద్ధంతో పామాయిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోకి పొద్దుతిరుగుడు నూనె రావడం తగ్గిపోవడంతో పామాయిల్​కు డిమాండ్​ పెరిగింది. కేవలం రెండు నెలల్లోనే పామాయిల్​ ధర సుమారు 40 రూపాయలు పెరగటం గమనార్హం.

  • 'దాడికి జెలెన్‌స్కీనే కారణం'

Ukraine Crisis: జపోరిజియాపై రష్యా దాడి చేయడానికి తమ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీయే కారణం అని ఆరోపించారు ఉక్రెయిన్​ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్‌. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించేలా నాటోను ఒప్పించేందుకే జెలెన్​స్కీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • 'చనిపోతున్న బిడ్డల గురించి...'

Olena Zelenska urging first ladies: ఉక్రెయిన్​పై రష్యా చేపట్టింది సైనిక చర్య కాదని, పూర్తిస్థాయి యుద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య వొలెనా జెలెన్​స్కా అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలని ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో భావోద్వేగ సందేశాన్ని ఉంచారు.

  • జూన్‌లో కరోనా నాలుగో దశ ?

Corona Fourth Wave: కరోనా నాలుగో దశపై ఐఐటీ కాన్పూర్‌కి చెందిన పరిశోధకుల అంచనాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. నాలుగో వేవ్​ జూన్​ ప్రారంభమై అక్టోబర్‌లో ముగుస్తుందని ప్రకటించారు. గతంలో ఈ పరిశోధక బృందం అంచనాలు దాదాపు నిజం కావడం వల్ల మరో వేవ్​ వస్తుందన్న భయాలు నెలకొన్నాయి. అయితే వీటిని కొందరు నిపుణులు తోసిపుచ్చారు.

అతనితోనే నా పెళ్లి: రష్మిక

Aadavallu meeku joharlu success meet: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు అగ్ర కథానాయిక రష్మిక.చిత్రం విజయోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఇంకా ఏమన్నారంటే..?

  • చిరంజీవికి ఆహ్వానం

Kishan Reddy Meet Chiranjeevi: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కలిసి ఆహ్వానించారు.

'రోహిత్​ కాదు.. నేనే.. '

IND VS SL Ravindra jadeja double century: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ ప్రకటించడంపై కెప్టెన్​ రోహిత్​ను విమర్శించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో దీనిపై జడేజా స్పందించాడు. డిక్లేర్​ చేయాలని స్వయంగా తానే జట్టుకు సందేశం పంపినట్లు తెలిపాడు. ఈ ఇన్నింగ్స్​లో అతడు 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.